Priyanka Arul Mohan: టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది నాని సరసన ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో నటించిన హీరోయిన్ ప్రియాంకా అరుళ్ మోహన్. లక్కు కలిసొచ్చిందేమో గానీ, వరుసబెట్టి కొత్త సినిమాలను కమిటవుతోంది. కన్నడ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ప్రియాంకా అరుళ్ మోహన్ ఆ తర్వాత నాని హీరోగా విక్రం కె కుమార్ దర్శకత్వంలో వచ్చిన గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగు తెరకి పరిచయమైంది.
ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినప్పటికీ, శర్వానంద్ సరసన శ్రీకారం సినిమాలోనూ హీరోయిన్‌గా అవకాశం అందుకుంది. ఈ సినిమా కూడా ప్రియాంకా అరుళ్ మోహన్ కి సక్సెస్ ని ఇవ్వలేకపోయింది. దాంతో తెలుగు మేకర్స్ ఐరెన్ లెగ్ అంటూ పక్కన పెట్టేశారు. ఆ తర్వాత తమిళంలో సూర్య, శివ కార్తికేయన్‌ల సరసన హీరోయిన్‌గా నటించింది. బాగానే గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ తమిళంలో అభిమానులు గుడి కట్టేంత స్థాయి మాత్రం దక్కలేదు.
హీరోయిన్‌గా అమ్మడి కెరీర్ నత్త నడక సాగుతున్న సమయంలో ఊహించని అవకాశం.. అంటే పవన్ కళ్యాణ్ పక్కన ‘ఓజీ’ సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్. సుజీత్ దర్శకత్వంలో ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. అలాగే, రవితేజ సరసన కూడా ప్రియాంకా అరుళ్ మోహన్ కి ఛాన్స్ దక్కిందనే టాక్ వినిపిస్తోంది. ఈ క్రమమంలోనే తాజాగా నాని సరసన మళ్ళీ ఛాన్స్ అందుకుంది. ‘సరిపోదా శనివారం’ అనే సినిమాలో నానికి జంటగా ప్రియాంకా అరుళ్ మోహన్ ఎంపికైంది. ఇలా వరుసగా అవకాశాలు అందుకుంటూ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…
Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…
Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…
Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…
Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…
This website uses cookies.