Sun. Nov 16th, 2025

    Priyanka Arul Mohan: టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది నాని సరసన ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో నటించిన హీరోయిన్ ప్రియాంకా అరుళ్ మోహన్. లక్కు కలిసొచ్చిందేమో గానీ, వరుసబెట్టి కొత్త సినిమాలను కమిటవుతోంది. కన్నడ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ప్రియాంకా అరుళ్ మోహన్ ఆ తర్వాత నాని హీరోగా విక్రం కె కుమార్ దర్శకత్వంలో వచ్చిన గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగు తెరకి పరిచయమైంది.

    Priyanka Arul Mohan: Nani heroine who has become a hot topic in Tollywood..!
    Priyanka Arul Mohan: Nani heroine who has become a hot topic in Tollywood..!

    ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినప్పటికీ, శర్వానంద్ సరసన శ్రీకారం సినిమాలోనూ హీరోయిన్‌గా అవకాశం అందుకుంది. ఈ సినిమా కూడా ప్రియాంకా అరుళ్ మోహన్ కి సక్సెస్ ని ఇవ్వలేకపోయింది. దాంతో తెలుగు మేకర్స్ ఐరెన్ లెగ్ అంటూ పక్కన పెట్టేశారు. ఆ తర్వాత తమిళంలో సూర్య, శివ కార్తికేయన్‌ల సరసన హీరోయిన్‌గా నటించింది. బాగానే గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ తమిళంలో అభిమానులు గుడి కట్టేంత స్థాయి మాత్రం దక్కలేదు.

    Priyanka Arul Mohan: Nani heroine who has become a hot topic in Tollywood..!
    Priyanka Arul Mohan: Nani heroine who has become a hot topic in Tollywood..!

    Priyanka Arul Mohan: ‘సరిపోదా శనివారం’ అనే సినిమాలో నానికి జంటగా 

    హీరోయిన్‌గా అమ్మడి కెరీర్ నత్త నడక సాగుతున్న సమయంలో ఊహించని అవకాశం.. అంటే పవన్ కళ్యాణ్ పక్కన ‘ఓజీ’ సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్. సుజీత్ దర్శకత్వంలో ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. అలాగే, రవితేజ సరసన కూడా ప్రియాంకా అరుళ్ మోహన్ కి ఛాన్స్ దక్కిందనే టాక్ వినిపిస్తోంది. ఈ క్రమమంలోనే తాజాగా నాని సరసన మళ్ళీ ఛాన్స్ అందుకుంది. ‘సరిపోదా శనివారం’ అనే సినిమాలో నానికి జంటగా ప్రియాంకా అరుళ్ మోహన్ ఎంపికైంది. ఇలా వరుసగా అవకాశాలు అందుకుంటూ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.