Ponnam Prabhakar : బోనాల ఉత్సవం ద్వారా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటుదామని పర్యాటక శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఈ నెల 26 నుంచి ప్రారంభమయ్యే బోనాల జాతరను దృష్టిలో పెట్టుకుని మంగళవారం గోల్కొండ కోటలో నిర్వహించిన అధికారుల సమన్వయ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.
భక్తులకు అన్ని రకాల వసతులు కల్పించాలని సూచించిన మంత్రి, అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు. ప్రత్యేకంగా పర్యాటక శాఖ బోనాల ప్రాధాన్యతను ప్రదర్శించేలా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని, దేశ విదేశాల నుంచి పర్యాటకులను ఆకర్షించేలా రూపొందించాలన్నారు.
ఇప్పటి తరానికి రీల్స్, షార్ట్ వీడియోలపై ఆసక్తి ఎక్కువగా ఉండటంతో, సమాచార శాఖ ఈ మార్గాన్ని వినియోగించుకుని బోనాల గొప్పదనాన్ని ప్రజల్లోకి చొప్పించాలన్నారు. రీల్స్, మినీ డాక్యుమెంటరీల రూపంలో ప్రచారం జరపాలని సూచించారు. అలాగే, గతంలో లాగే ఆషాఢ మాసాంతం వరకు గోల్కొండ కోటలో ఉచిత ప్రవేశాన్ని కొనసాగించాలని, మంగళవారాల్లో ప్రత్యేకంగా ఉచిత ప్రవేశం కల్పించాలని పురావస్తు శాఖకు సిఫార్సు చేసినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ, గోల్కొండ బోనాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపనున్నామని తెలిపారు.సమావేశంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహినుద్దీన్, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, గోల్కొండ జగదాంబిక ఆలయ చైర్మన్ కొండెపుడి చంటిబాబు, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన్ తదితరులు పాల్గొన్నారు.సమావేశానికి ముందు, మంత్రి పొన్నం ప్రభాకర్ గోల్కొండ కోటలోని నాగదేవత పుట్ట వద్ద పూజలు నిర్వహించి అమ్మవారికి కల్లు సాకపెట్టారు.
ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…
Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…
Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…
Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…
Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…
This website uses cookies.