Thu. Jul 10th, 2025

    Ponnam Prabhakar : బోనాల ఉత్సవం ద్వారా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటుదామని పర్యాటక శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఈ నెల 26 నుంచి ప్రారంభమయ్యే బోనాల జాతరను దృష్టిలో పెట్టుకుని మంగళవారం గోల్కొండ కోటలో నిర్వహించిన అధికారుల సమన్వయ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.

    భక్తులకు అన్ని రకాల వసతులు కల్పించాలని సూచించిన మంత్రి, అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు. ప్రత్యేకంగా పర్యాటక శాఖ బోనాల ప్రాధాన్యతను ప్రదర్శించేలా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని, దేశ విదేశాల నుంచి పర్యాటకులను ఆకర్షించేలా రూపొందించాలన్నారు.

    ponnam-prabhakar-lets-tell-the-world-the-uniqueness-of-telangana-bonas
    ponnam-prabhakar-lets-tell-the-world-the-uniqueness-of-telangana-bonas

    Ponnam Prabhakar : ఇప్పటి తరానికి రీల్స్, షార్ట్ వీడియోలపై ఆసక్తి

    ఇప్పటి తరానికి రీల్స్, షార్ట్ వీడియోలపై ఆసక్తి ఎక్కువగా ఉండటంతో, సమాచార శాఖ ఈ మార్గాన్ని వినియోగించుకుని బోనాల గొప్పదనాన్ని ప్రజల్లోకి చొప్పించాలన్నారు. రీల్స్, మినీ డాక్యుమెంటరీల రూపంలో ప్రచారం జరపాలని సూచించారు. అలాగే, గతంలో లాగే ఆషాఢ మాసాంతం వరకు గోల్కొండ కోటలో ఉచిత ప్రవేశాన్ని కొనసాగించాలని, మంగళవారాల్లో ప్రత్యేకంగా ఉచిత ప్రవేశం కల్పించాలని పురావస్తు శాఖకు సిఫార్సు చేసినట్లు తెలిపారు.

    ఈ సందర్భంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ, గోల్కొండ బోనాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపనున్నామని తెలిపారు.సమావేశంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహినుద్దీన్, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, గోల్కొండ జగదాంబిక ఆలయ చైర్మన్ కొండెపుడి చంటిబాబు, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన్ తదితరులు పాల్గొన్నారు.సమావేశానికి ముందు, మంత్రి పొన్నం ప్రభాకర్ గోల్కొండ కోటలోని నాగదేవత పుట్ట వద్ద పూజలు నిర్వహించి అమ్మవారికి కల్లు సాకపెట్టారు.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.