Politics: నారా లోకేష్ ఈనెల 27 నుంచి పాదయాత్ర చేయబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. యువ గళం పేరుతో ఈ పాదయాత్రను చేపట్టడానికి ఇప్పటికే రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారు. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు సుమారు 123 నియోజకవర్గాల్లో నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్రను చేయడానికి నారా లోకేష్ నిర్ణయించుకున్నారు. అయితే ఈ పాదయాత్ర కోసం ఇప్పటికే టీడీపీ పార్టీ డీజీపీకి పర్మిషన్ కోసం లేఖ రాశారు. అయితే డీజీపీ కార్యాలయం నుంచి ఇప్పటివరకు పాదయాత్రపై ఎలాంటి అనుమతి రాలేదు. తాజాగా ఈ పాదయాత్రలో ఎంతమంది పాల్గొంటారు ఎన్ని రోజులు జరుగుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పాదయాత్ర కొనసాగిస్తారు అనే వివరాలతో అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని డీజీపీ నుంచి తెలుగుదేశం పార్టీకి ఆదేశాలు వచ్చాయి.
అయితే పాదయాత్రను కావాలని వైసీపీ ప్రభుత్వం అడ్డుకోవాలని చూస్తుందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పాదయాత్ర చేస్తే ఎక్కడ ప్రజా వ్యతిరేకత తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మారిపోతుందో అనే భయం వైసీపీ పార్టీలో ఉందని టీడీపీ నేతలు అంటున్నారు. గతంలో వైయస్ జగన్ పాదయాత్రకి అనుమతి ఇవ్వకుండా ఉంటే ఈరోజు అధికారంలోకి వచ్చే వారే కాదని విమర్శిస్తున్నారు. అలాగే ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన ఇవ్వకున్నా పాదయాత్ర మాత్రం ఖచ్చితంగా జరిగి తీరుతుందని వర్ల రామయ్య తెలిపారు. కావాలని కుట్రలు చేస్తూ పాదయాత్రకు ఆటంకం సృష్టించాలని భావిస్తున్నారని విమర్శించారు. జగన్ పరిపాలనపై విసిగిపోయి ఉన్న ప్రజలందరూ కూడా ఖచ్చితంగా పాదయాత్రలో పాల్గొంటారని అన్నారు.
అలాగే నారా లోకేష్ పాదయాత్రలో దాడులు చేయాలని వైసిపి సోషల్ మీడియా గ్రూప్స్ వాట్సాప్ లో సందేశాలు పంపుతున్నారని తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. వీటిని ఆధారాలతో సహా చూపించారు. కుట్రలు చేసి పాదయాత్రను అడ్డుకోవాలని ప్రయత్నిస్తే అంతే దీటుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సమాధానం చెబుతారని అన్నారు. మొత్తానికి ఇప్పుడు తెలుగుదేశం వైసిపి పార్టీల మధ్య నారా లోకేష్ పాదయాత్ర మీద రాజకీయం నడుస్తుంది అనే మాట వినిపిస్తుంది.
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…
Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…
This website uses cookies.