Technology: కృత్రిమ మేధస్సు తీసుకొచ్చే ప్రమాదం ఏ స్థాయిలో ఉంటుందంటే?

Technology: కృత్రిమ మేధస్సు భవిష్యత్తులో మానవ సమాజాన్ని శాసిస్తుంది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భవిష్యత్తులో మన ప్రతి అవసరాన్ని ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ముందుగానే పసిగట్టి కావాల్సినది అందించే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే అమెరికాలో టెస్లా ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ తో నడిచే కార్లని తయారు చేస్తుంది. ఇక గూగుల్ సెర్చ్ ఇంజన్ కూడా కృత్రిమ మేధస్సుతోనే నడుస్తుందని చాలా మందికి తెలియదు. మనం ఏ అంశాన్ని అయితే ఎక్కువగా గూగుల్ లో సెర్చ్ చేస్తామో `వాటినే మనకి ఎక్కువగా రికమండ్ చేస్తాయి. అలాగే మన యాప్స్, యుట్యూబ్ లో కూడా వాటికీ సంబందించిన యాడ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. దీనికి కారణం ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ అనే విషయం చాలా మంది గుర్తించరు.

అందుకే గూగుల్ లో శోధించే ఎలాంటి సమాచారం అయిన జాగ్రత్తగా వెతకాలి అని చెబుతూ ఉంటారు. ఇక చాట్ జీపీటీ అనే చాట్ బొట్ ప్రపంచ వ్యాప్తంగా ట్రెండింగ్ లో ఉంది. ఇందులో మనకి కావాల్సిన ఏ సమాచారం అయిన చాలా సులభంగా వచ్చేస్తుంది. లీవ్ లెటర్ అని `టైప్ చేస్తే దానికి సంబందించిన శాంపిల్ వచ్చేస్తుంది. అలాగే ఒక కథకి సంబందించిన ఐడియాని అందులో టైప్ చేస్తే. అదే ఆటోమేటిక్ గా ఇంటరెస్టింగ్ కథని తయారు చేసి ఇస్తుంది. లవ్ లెటర్ కావాలన్నా కూడా రాసి ఇస్తుంది. అయితే భవిష్యత్తులో టెక్నాలజీతో పనిచేసే అన్నింట్లో కూడా ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ఉంటుంది.

అయితే దీనిని ఎంత వరకు ఉపయోగించాలో అంత వరకు యూజ్ చేస్తే ఎలాంటి ప్రమాదం ఉండదు. అయితే అతిగా ఉపయోగిస్తే మాత్రం చాలా ప్రమాదంలో పడే ఛాన్స్ ఉంది. అలాగే ఈ `కృత్రిమ మేధస్సు సాయంతో ఫేక్ మార్ఫింగ్ వీడియోలని కూడా క్రియేట్ చేయడం చాలా సులభం అనే విషయాన్ని ఓ యువకుడు వీడియో రూపంలో బయట పెట్టాడు. ఆ వీడియోని ఆనంద్ మహేంద్రా ట్విట్టర్ లో షేర్ చేశాడు. ఆ వీడియోలో యువకుడు కృత్రిమ మేధస్సుతో మార్ఫింగ్ వీడియోలు ఎంత సులభంగా చేయవచ్చో చూపించాడు. క్రింద వీడియోలో ఆ యువకుడు వాయిస్ చెబుతూ ఉంటే పైన ఉన్న వీడియోలో ఎవరి పేస్ కావాలంటే వారి పేస్ మార్ఫింగ్ అయిపోతుంది. మార్ఫింగ్ అని ఏ మాత్రం తేడా లేకుండా ఆ వీడియో ఉండటం విశేషం.

ఈ వీడియోని షేర్ చేసిన ఆనంద్ మహేంద్రా భవిష్యత్తులో ఇలాంటి మోసపూరిత కంటెంట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఆరంభంలో ఇది భాగానే ఉంటుంది. కాని మన వ్యతిరేకులు ఇలాంటి వాటిని ఉపయోగించి తప్పుడు వీడియోలు క్రియేట్ చేసి మనమే చేసాం అనే విధంగా భ్రమింపజేసే అవకాశం ఉంది. ఇలాంటి ప్రమాదకరమైన టెక్నాలజీ చేతుల్లోకి భవిష్యత్తులో మనం వెళ్ళబోతున్నాం. వీటిని నియంత్రించాలంటే కచ్చితంగా కచ్చితమైన సెక్యూరిటీ, రక్షణ వ్యవస్థ ఉండాలని ఆనంద్ మహేంద్రా తెలిపారు. ఏది ఏమైనా ఈ వీడియో చూసిన తర్వాత కచ్చితంగా భవిష్యత్తుపై చాలా మంది భయపడటం పక్కా అనే మాట వినిపిస్తుంది.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

NATS: షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్

NATS: అమెరికాలోని షార్లెట్‌ లో నిర్వహించిన ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత, పెద్దలు…

5 days ago

Sai Gangula: న్యూజెర్సీ తెలుగు సమాజానికి నాట్స్ కొత్త నాయకత్వం – చాప్టర్ లీడర్‌గా సాయి గంగుల నియామకం

Sai Gangula: న్యూజెర్సీలోని తెలుగు సమాజానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. నాట్స్ న్యూజెర్సీ…

1 week ago

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

3 weeks ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

3 weeks ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

1 month ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 month ago

This website uses cookies.