Carrot: ప్రతిరోజు క్యారెట్ ను ఆహారంగా తీసుకుంటే మన శరీరానికి అవసరమైన విటమిన్స్,మినరల్స్ , ప్రోటీన్స్ , కార్బోహైడ్రేట్స్, ఖనిజలవనాలు పుష్కలంగా లభిస్తాయి.మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో క్యారెట్ కీలకపాత్ర పోషిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నటువంటి క్యారెట్ తినడం వల్ల అధిక ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడేవారు మాత్రం ఈ క్యారెట్ తినకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
క్యారెట్ లో మన శరీరానికి అవసరమైన బీటా కెరోటిన్ అనే పదార్థం అధికంగా ఉంటుంది. బీటా కెరోటిన్ మన శరీరంలో విటమిన్ A గా మారుతుంది. తరచూ పచ్చకామెర్ల సమస్యతో బాధపడేవారు క్యారెట్లను ఎక్కువగా తినడం వల్ల రక్తంలో కెరోటిన్ స్థాయి పెరిగిపోయి కెరోటినిమియాకు కారణమవుతుంది. దీనివల్ల చర్మం పసుపు రంగులోకి మారి కామెర్ల సమస్య అధికమవుతుంది.
షుగర్ సమస్యతో బాధపడే వారు కూడా క్యారెట్ తినకపోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు షుగర్ వ్యాధితో బాధ పడేవారు క్యారెట్ తినడం వల్ల ఇవి రక్తంలో గ్లూకోస్ స్థాయిలను పెంచి షుగర్ వ్యాధి తీవ్రతను మరింత పెంచుతుంది. గర్భిణులు, పాలిచ్చే తల్లులు క్యారెట్లను తమ ఆహారంలో తక్కువగా తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. దీనికి కారణం క్యారెట్ లో ఉన్న కొన్ని ఔషధ గుణాలు తల్లిపాల రుచిని మార్చి చిన్న పిల్లల ఆరోగ్యానికి కొంత హాని కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు. వీటితోపాటు జీర్ణ క్రియ సమస్యలను ఎదుర్కొనేవారు కూడా క్యారెట్ తమ ఆహారంలో భాగంగా చేసుకోకపోవడం ఎంతో మంచిదని నిపుణులు తెలియజేస్తున్నారు.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.