Peepal Tree: మన హిందువులు ఎన్నో రకాల ఆచార వ్యవహారాలను నమ్ముతూ ఉంటారు ఇలా హిందువులు ఎంతో పవిత్రంగా కొన్ని మొక్కలను జంతువులను కూడా పూజిస్తూ ఉంటారు. ఇలా పవిత్రంగా భావించే చెట్లలో రావి చెట్టు కూడా ఒకటి. రావి చెట్టును హిందూ సాంప్రదాయాల ప్రకారం ఎంతో పవిత్రమైనటువంటి చెట్టుగా భావించి పూజిస్తూ ఉంటారు రావి చెట్టును సాక్షాత్తు విష్ణు స్వరూపంగా భావిస్తుంటారు అంతేకాకుండా ఈ చెట్టులో సకల దేవతలు కొలువై ఉంటారని విశ్వసిస్తారు.
ఈ క్రమంలోనే రావి చెట్టుకు కూడా పెద్ద ఎత్తున పూజలు చేయడం మనం చూస్తుంటాము. రావి చెట్టుకు శనివారం పూజ చేసి నువ్వుల నూనెతో దీపారాధన చేసి ప్రదక్షిణలు చేయటం వల్ల శని ప్రభావ దోషాలు కూడా తొలగిపోతాయని భావిస్తారు అయితే రావి చెట్టు ఎక్కువగా మనకు దేవాలయంలో మాత్రమే కనపడుతూ ఉంటుంది. ఈ చెట్టు ఎక్కడా కూడా ఇంటి ఆవరణంలో కనిపించదు అయితే ఈ చెట్టు ఇంటి ఆవరణంలో ఉండకూడదా ఉంటే ఏం జరుగుతుంది అనే విషయానికి వస్తే రావి చెట్టు పెద్ద అయిన తర్వాత మహా వృక్షంగా మారుతుంది. దీంతో ఈ చెట్టు వేర్లు మన ఇంటి పునాదులను కూడా బలహీనపరచడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి.
ఇలా మన ఇంటి పునాదులను కూడా ఈ మొక్కలు కదిలిస్తూ ఉండటం వల్ల ఈ వృక్షాలను ఇంటి ఆవరణంలో ఎవరు కూడా పెట్టుకోరు అదే విధంగా ఈ మొక్క 24 గంటలు ఆక్సిజన్ అందిస్తుంది ఇలా అధిక ఆక్సిజన్ మన శరీరానికి అందటం ఆరోగ్యానికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు కూడా చెబుతున్నారు అయితే ఈ రావి చెట్టు నీడ ఇంటిపై పడటం వల్ల కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఉండదని అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయని చెబుతున్నారు అందుకే ఈ మొక్కను ఎవరు కూడా ఇంటి ఆవరణంలో నాటరు.