Headache: సాధారణంగా తరచూ కొంతమంది విపరీతమైనటువంటి తలనొప్పి సమస్యతో బాధపడుతూ ఉంటారు ఇలా తలనొప్పి కనుక మిమ్మల్ని వేధిస్తున్నట్లయితే తలనొప్పి మాత్రలు వేసుకొని ఉపశమనం పొందుతూ ఉంటారు. ఇలా తరచూ టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల మనకు తలనొప్పి తగ్గడం ఏమో కానీ ఇతర సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అందుకే తలనొప్పి వచ్చినప్పుడు చిన్న చిట్కాలతో ఈ సమస్య నుంచి మనం బయటపడవచ్చు మరి ఆ చిట్కాలు ఏంటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…

తలనొప్పి సమస్యతో బాధపడేవారు ఒక చిన్న మెత్తని గుడ్డను చల్లనీటిలో ముంచి దానిని తలపై వేసుకొని మెల్లగా మసాజ్ చేయాలి ఇలా చేయడం వల్ల రక్తనాళాలు విస్తరించి రక్తప్రసరణకు ఎలాంటి అవాంతరాలు లేకుండా ఉంటుంది తద్వారా తలనొప్పి సమస్య పూర్తిగా తగ్గుతుంది అదేవిధంగా గోరువెచ్చని నీటిలో పది నిమిషాల పాటు మన పాదాలను పెట్టుకోవడం వల్ల కూడా తలనొప్పి సమస్య తగ్గుతుంది పాదాల నుంచి వేడి రక్తనాళాల ద్వారా తలకు చేరటం వల్ల నొప్పి సమస్య పూర్తిగా తగ్గుతుంది.
ఇక ఇంట్లో అరటిపండు కనుక ఉన్నట్లయితే అరటిపండు తొక్కను డి ఫ్రిజ్లో ఐదు నిమిషాలు పాటు వేసి ఆ అరటిపండు తొక్కను నుదిటిపై వేసుకోవడం వల్ల ఈ నొప్పి నుంచి పూర్తిగా ఉపశమనం పొందవచ్చు. ఇక చాలామందికి తలనొప్పి ఎక్కువగా ఎప్పుడు వస్తుంది అంటే అధిక కాంతికి ఎక్స్పోజ్ అవ్వటం వల్ల కూడా తలనొప్పి సమస్య వస్తుంది బయట ఎండలో తిరగటం లేదా స్మార్ట్ ఫోన్ టీవీ ఎక్కువగా చూడటం వంటి వాటి ద్వారా కూడా తలనొప్పి ఎక్కువగా వస్తుంది. ఇలాంటి వారు కొద్దిగా సెల్ఫోన్లను చూడటం తగ్గించుకోవటం మంచిది. ఇక తలనొప్పి సమస్య వచ్చినప్పుడు వెంటనే ఒక గ్లాస్ నీటిని తాగటం వల్ల తలనొప్పి సమస్య తగ్గుతుంది.