Payal Ghosh: పాయల్ ఘోష్ మొదట తెలుగులో ప్రయాణం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించడంతో పాటు ఆ సినిమాతో ఆకట్టుకుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ తో కలిసి ఊసరవెల్లి అనే సినిమాలో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాతో కూడా భారీగా పాపులారిటీని ఏర్పరచుకుంది. ఆ తర్వాత టాలీవుడ్ లో సరైన అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ కి చెక్కేసింది. అక్కడ వరుసగా సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం బాలీవుడ్లో పలు సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. అయితే పాయల్ సినిమాల ద్వారా కంటే కాంట్రవర్సీల ద్వారా ఎక్కువగా సోషల్ మీడియాలో నిలుస్తూ ఉంటుంది.
తరచూ ఏదో ఒక ట్వీట్ చేస్తూ లేనిపోని కాంట్రవర్సీలను కొని తెచ్చుకుంటూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఈమె పెట్టే పోస్టులు సోషల్ మీడియాలో సంచలనంగా మారడంతో పాటు చర్చనీయాంశంగా మారుతూ ఉంటాయి. ఇది ఇలా ఉంటే తాజాగా మరోసారి సోషల్ మీడియాలో షాకింగ్ పోస్ట్ చేసింది. బాలీవుడ్ నటులను ఉద్దేశిస్తూ ఆమె చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ఇంతకీ ఆ పోస్టులో ఏముందంటే.. టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణతో కలిసి దిగిన ఫోటో ని షేర్ చేస్తూ బాలీవుడ్‌ను ఉద్దేశించి కామెంట్ చేసింది. ప్రస్తుతం బాలకృష్ణ వరుస సినిమాలతో అలరిస్తున్న సంగతి తెలిసిందే.
ఇదే విషయాన్ని పాయల్ ఘోష్ తన పోస్ట్‌లో తెలిపింది. బాలకృష్ణ గారు ఈ వయసులో కూడా సూపర్ హిట్ సినిమాలను అందిస్తున్నారు. బాలీవుడ్ నటులు ఆయన్ని చూసి నేర్చుకోవాలి అని ట్విట్టర్ లో రాసుకొచ్చింది. కాగా ఆ పోస్ట్ పై టాలీవుడ్ ప్రేక్షకులు నందమూరి అభిమానులు పాజిటివ్ గా స్పందిస్తుండగా బాలీవుడ్ ప్రేక్షకులు మండిపడుతూ ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇకపోతే బాలయ్య బాబు విషయానికి వస్తే.. ఈ ఏడాది ఆరంభంలో వీరసింహారెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న బాలయ్య బాబు తాజాగా భగవంత్ కేసరి సినిమాతో మరో సూపర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం బాలయ్య బాబు ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే ప్రస్తుతం తదుపరి సినిమా పనులలో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు. అలాగే రాజకీయాలలో కూడా ఫుల్ యాక్టివ్ గా గడుపుతున్నారు. కాగా బాలయ్య బాబు తన తదుపరి సినిమాను బాబీ దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తి అవ్వగా షూటింగ్ కూడా మొదలైనట్లు తెలుస్తోంది.