Lavanya Tripathi: టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి గురించి మనందరికీ తెలిసిందే. అందాల రాక్షసి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో పలు సినిమాలలో నటించే హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకుంది. ఈ కాగా తెలుగులో నాగార్జున, నాగచైతన్య, శిరీష్, వరుణ్, నాని, సందీప్ కిషన్, విష్ణు వంటి హీరోల సరసన నటించి మెప్పించింది. ఆ సమయంలోనే 2017లో మిస్టర్ సినిమా సమయంలో హీరో వరుణ్ తేజ్ తో ప్రేమలో పడింది. ఇక అప్పటి నుంచి వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఇద్దరూ కూడా సీక్రెట్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ వచ్చారు.
కానీ ఏ రోజు కూడా వారి ప్రేమ వ్యవహారం బయటపడకుండా బయటకు తెలియకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు. వీరిద్దరి విషయంలో పలు సార్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపించినప్పటికీ ఆ వార్తలపై స్పందించలేదు. ఆ వార్తలను నిజం చేస్తూ తాజాగా నవంబర్ 1న ఇటలీలో గ్రాండ్ గా పెళ్లి చేసుకుని మూడుముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు లావణ్య, వరుణ్ తేజ్. గత రెండు మూడు రోజులుగా వీరిద్దరి పెళ్లి ఫోటోలు అలాగే వీరికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి. ఇటలీలో పెళ్లి అయిపోవడంతో ఈ జంట హైదరాబాద్ కు చేరుకున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో లావణ్య త్రిపాఠి కి సంబంధించి ఒక ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది.
అదేమిటంటే కొత్త పెళ్లికూతురు సినిమాల విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకుందట. ఇకపై కేవలం లేడీ ఓరియంటెడ్ సినిమాలో మాత్రమే తీయాలని లావణ్య నిర్ణయించుకున్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఏ హీరోతో చేసినా రొమాన్స్ సీన్స్ ఉంటాయి కాబట్టి దాని వల్ల మెగా ఫ్యామిలీ పరువు పోతుందని ఆలోచిస్తుందట. మెగా ఫ్యామిలీ ఎలాంటి కండీషన్లు పెట్టకపోయినా కోడలుగా పరువు పెంచే పాత్రలు మాత్రమే చేయాలనుకుంటోందని తెలుస్తోంది. దీంతో ఈ విషయం తెలిసిన నెటిజన్లు పెళ్లి తర్వాత కెరీర్ పరంగా లావణ్యకు మరింత కలిసి రావాలని కోరుకుంటున్నారు. ఇకపోతే రెండు మూడు రోజులుగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం నేడు అనగా నవంబర్ 5 సాయంత్రం హైదరాబాదులో లావణ్య, వరుణ్ తేజ్ ల రిసెప్షన్ జరుగునుందట.. ఈ రిసెప్షన్ వేడుకకు టాలీవుడ్ లో సెలబ్రిటీలు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.