Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలలో రాబోయే ఎన్నికలలో చాలా కీలకంగా మారబోతున్నారు అని ఇప్పటికే ఒక స్పష్టత వచ్చేసింది. పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు ద్వారా పోటీ చేసిన అన్ని నియోజకవర్గాలలో గెలవడంతో పాటు వైసీపీని కోలుకోలేని దెబ్బ తీయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ దిశగా తన ఒక్కో వ్యూహాన్ని అమలు చేసుకుంటూ వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ వ్యూహాలతో, నిర్ణయాలతో వైసీపీ అధిష్టానంకి ఇప్పటికే కలవరం మొదలైంది. నెలలో రెండు మూడు రోజులు రాజకీయ కార్యాచరణతో ప్రజల్లో ఉంటేనే వైసీపీ వారికి తలనొప్పిగా మారుతున్నాడు.
అదే పూర్తి స్థాయిలో రాజకీయాలు చేయడం స్టార్ట్ చేస్తే పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జూన్ నుంచి మంగళగిరిలో అందుబాటులో ఉంటానని, పూర్తి స్థాయిలో రాజకీయ కార్యాచరణతో ప్రజలలోకి వెళ్ళే ప్లాన్ చేస్తానని పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చేశారు. నెలలో ఓ పది రోజులు మాత్రమే షూటింగ్ కోసం కేటాయించి మిగిలిన 20 రోజుల్లో ప్రజల మధ్య ఉండాలని నిర్ణయించుకున్నారు. జూన్ తర్వాత పొత్తులపై కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అంతకంటే ముందుగానే రాష్ట్ర వ్యాప్తంగా వారాహితో యాత్ర చేయడానికి పవన్ కళ్యాణ్ సిద్ధం అవుతున్నారు.
ఆగష్టు తర్వాత ఈ యాత్ర ఉండే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలలో వినిపిస్తోంది. ఇక యాత్ర మొదలు పెడితే గత ఎన్నికల ముందు టీడీపీ మీద ఎలా అయితే రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత పెరగడానికి పవన్ కళ్యాణ్ కారణం అయ్యారో అలాగే వైసీపీ మీద వ్యతిరేకత పెంచడంలో సక్సెస్ అవుతాడని భావిస్తున్నారు. అయితే రానున్న రోజులు మాత్రం వైసీపీ బలమైన వ్యూహాలతో పవన్ కళ్యాణ్ ని ఎదుర్కోలేకపోయిన, ఎప్పుడు చేసినట్లే మూడు పెళ్ళిళ్ళు అంటూ ప్రచారం చేసిన అది ఆ పార్టీకి మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి జూన్ నుంచి పవన్ కళ్యాణ్ వ్యూహాలతో ఎలా వైసీపీ ఎదుర్కొంటుంది అనేది వేచి చూడాలి.