Ration Card : మీకు రేషన్ కార్డు ఉందా? అయితే జూన్ 30లోపు ఈ పని తప్పక చేయండి. లేదంటే మీరు రేషన్ కార్డుపై పొందే ఈ సేవలన్నీ పొందకపోవచ్చు. రేషన్ కార్డును ఆధార్ తో లింక్ చేయాలనీ కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. కొంతకాలంగా ప్రభుత్వం చెబుతున్నా కొట్లాది మంది రేషన్ కార్డు దారులు ఇంకా తమ కార్డులను ఆధార్ కు అనుసంధానం చేయలేదు. ఒకవేళ మీరు జూన్ 30, 2023 వరకు రేషన్ కార్డును , ఆధార్ లింక్ చేయకపోతే మీ రేషన్ కార్డు రద్దు చేస్తారు.

రేషన్ కార్డు రద్దుతో చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇప్పటివరకు కార్డు దారులు పొందుతున్న సేవలు నిలిచిపోతాయట. రేషన్‌లో లభించే గోధుమ పిండి, బియ్యం ఇకపై పొందే వీలు ఉండదు.లభించదు. రేషన్ కార్డ్ రద్దుతో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలా ఇప్పుడు రేషన్ కార్డును ఆధార్ తో లింక్ చేస్తే పాస్పోర్ట్, పాన్ కార్డ్ మాత్రమే కాదు , రేషన్ కార్డును చిరునామా రుజువుగా ఉపయోగించవచ్చు.

ఈ మధ్య చాలా మంది ఒకటి కంటే ఎక్కువగా రేషన్ కార్డులను తీసుకుంటున్నారు . అర్హులకు రేషన్ కార్డులు అందడం లేదు. అందుకే అర్హులైన వారికి కార్డు లు అందించాలని, అధిక ఆదాయ పరిమితి కారణంగా రేషన్ పొందడానికి అనర్హులుగా ఉన్న వారిని గుర్తించవచ్చనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తో అర్హులకు న్యాయం జరుగుతుంది డూప్లికేట్ రేషన్ కార్డులకు చెక్ పెట్టవచ్చు. మరి ఇప్పటికీ రేషన్ కార్డుతో ఆధార్ లింక్ చేయకపోతే జూన్ 30, 2023లోపు ఈ పనిని పూర్తి చేయండి.
ఆన్లైన్ లోనే సులువుగా రేషన్ కార్డుతో ఆధార్ లింక్ చేసుకోవచ్చు. PDS పోర్టల్ వెబ్‌సైట్ లోకి వెళ్ళాలి. ఆధార్ కార్డ్ , రేషన్ కార్డ్ తో సహా ఫోన్ నంబర్ ను నమోదు చేయాలి. మొబైల్ కి OTP వస్తుంది. ఆ OTPని ఎంటర్ చేయాలి. అలా రేషన్ కార్డ్-ఆధార్ కార్డ్ ను ఆన్లైన్లో లింక్ చేసుకోవచ్చు.
ఆఫ్‌లైన్‌లో చేసుకునే వారు రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఫోటోస్టాట్ తీసుకుని . ఆ తరువాత, కుటుంబ యజమాని పాస్‌పోర్ట్ సైజు ఫోటోను తీసుకొని దానిని రేషన్ కార్యాలయం లేదా రేషన్ దుకాణంలో వస్తుంది వ్వాలి . తర్వాత సెన్సార్‌పై వేలిముద్ర వేయాల్సి ఉంటుంది.
మీ డిపార్ట్‌మెంట్ పత్రాలను స్వీకరించిన తర్వాత మీకు SMS లేదా ఇమెయిల్ ద్వారా లింక్ వస్తుంది. సంబంధిత అధికార యంత్రాంగం , రేషన్ కార్-ఆధార్ లింక్ చేస్తారు .