Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలలో ఏదో చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అదే క్రమంలో వైసీపీకి వ్యతిరేకంగా ప్రజలని ఉత్తేజం చేస్తున్నారు. ప్రజలలో ఆలోచిస్తున్నారు అనే సమయానికి రాజకీయాలు పక్కన పెట్టి సినిమాలపై ద్యాస పెడుతున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ పార్ట్ టైమ్ రాజకీయాలు అటు రాజకీయ పార్టీలకి, ఇటు ప్రజలకి అర్ధం కాకుండా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకుంటే వైసీపీకి నష్టం, ఆ విషయం వారికి స్పష్టంగా తెలుసు. దీంతో టీడీపీతో పొత్తు పెట్టుకుంటాడని భావిస్తూ ఎలా అయిన వారిద్దరిని దూరం చేసే వ్యూహాలు జగన్ వేస్తున్నారు. మరో వైపు టీడీపీకి అసలు పవన్ కళ్యాణ్ చివరి టైమ్ లో హ్యాండ్ ఇచ్చేస్తే పరిస్థితి ఏంటి అనే భయంతో ఉన్నారు.
ఆ భయంతోనే ఇప్పటి నుంచి మనమే సొంతంగా బలపడితే బెటర్ అనుకుంటున్నారు. ఇక బీజేపీ కూడా పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు హ్యాండ్ ఇచ్చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. అందుకే వారు లెక్కలు వారు వేసుకుంటూ సొంతగా బలపడటానికి నాయకులని సిద్ధం చేసుకుంటున్నారు. ఇక జనసేన క్యాడర్ లో కూడా కన్ఫ్యూజన్ ఉంది. ఇంతకి పవన్ కళ్యాణ్ ఎలాంటి వ్యూహాలు వేస్తున్నారు. వచ్చే ఎన్నికలలో జనసేనని అధికారంలోకి తీసుకురావడానికి ఏం చేస్తున్నారు అనే డౌట్ తో ఉన్నారు. ఇక ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ కి ఈ సారి అవకాశం ఇస్తే బాగుంటుంది అని అనుకుంటున్న వెంటనే సౌండ్ లేకుండా సినిమాలతో బిజీ అయిపోతున్నారు.
ఎన్నికలు దగ్గర పడుతున్న అభ్యర్ధులపై ఇప్పటి వరకు స్పష్టత లేదు, అలాగే నియోజకవర్గాలలో సంస్థాగత బలం లేదు. క్యాడర్ కి దిశానిర్దేశ్యం చేసే నాయకత్వం లేదు. ఇలా అన్నింటా పవన్ కళ్యాణ్ మళ్ళీ 2019 పరిస్థితి తీసుకొస్తున్నారు అనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తోంది. వీటన్నింటికి పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఫుల్ స్టాప్ పెడతాడు అనేది సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఇదిలా ఉంటే తాజాగా బీఆర్ఎస్, జనసేన పొత్తు కూడా ఏపీలో తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది.