Mon. Jul 14th, 2025

    OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సుజీత్ (Sujeeth) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఓజీ (OG). యూవీ క్రియేషన్స్ (UV Creations) పతాకంపై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాకి రచనా సహకారం త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) అందిస్తున్నారు. గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ నటించే సినిమాలలో గురూజీ ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నారనే మాట ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. సాధారణంగా దర్శకుడిని నమ్మి ఫ్రీడం ఇస్తే బద్రి, తొలిప్రేమ, ఖుషి, గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్స్ వస్తాయి.

    కానీ, అత్తారింటికి దారేది సినిమా నుంచి పవన్ నటించే సినిమాకి త్రివిక్రమ్ దర్శకుడు కాకపోయినా స్క్రిప్ట్‌లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నారు. మంచి సినిమా కూడా త్రివిక్రమ్ వేలు పెట్టడం వల్లే ఫ్లాపవుతుందని టాక్ ఉంది. పవన్ కళ్యాణ్, బండ్ల గణేష్ (Bandla Ganesh) ల మధ్య దూరం పెరగడానికి ఓ విధంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కారణం అని చెప్పుకున్నారు. భీమ్లా నాయక్‌ సినిమాలో నిత్యా మీనన్ (Nithya Menen) కి సంబంధించిన చాలా సన్నివేశాలు తీసేశారట.

    og-pawan-kalyan-fires-on-trivikram-srinivas
    og-pawan-kalyan-fires-on-trivikram-srinivas

    OG: ఓజీ (OG) సినిమాకి రిపీట్ అవుతుందని సమాచారం.

    అంతేకాదు, K S చిత్ర (K S Chithra) గారు పాడిన సాంగ్ కూడా నిత్యా మీద అక్కసుతోనే త్రివిక్రమ్ తీసేయించినట్టు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అయింది. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన బ్రో (BRO) సినిమా హిట్ కావాల్సి ఉండగా, త్రివిక్రమ్ కొన్ని మంచి సీన్స్ డిలీట్ చేయించి ఫ్లాప్‌కి కారణం అయ్యాడని అంటున్నారు. ఇదే ఇప్పుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ఓజీ (OG) సినిమాకి రిపీట్ అవుతుందని సమాచారం.

    og-pawan-kalyan-fires-on-trivikram-srinivas
    og-pawan-kalyan-fires-on-trivikram-srinivas

    ఇప్పటికే, రెండు మంచి సీన్స్ ని బలవంతగా మార్పించారట త్రివిక్రమ్. దాంతో సుజీత్ హర్ట్ అయి పవన్ కళ్యాణ్ దృష్ఠికి తీసుకెళ్ళారట. అందుకే, పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ ని కొంచం లిమిట్స్‌లో ఉండమని వార్నింగ్ ఇచ్చారట. మరి ఇందులో నిజమెంత వరకూ ఉందో తెలియదు గానీ, ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. కాగా, ఓజీలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నారు. ప్రియాంక అరుళ్ మోహన్ (Priyanka Arul Mohan) హీరోయిన్. ఎస్ ఎస్ థమన్ (S S Thaman) సంగీతం అందిస్తున్నారు.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.