Wed. Jan 21st, 2026

    Nayanthara: సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ని మించిపోయిందనే టాక్ ఇప్పుడు అంతటా వైరల్ అవుతోంది. సినిమా విషయంలో నయన్ అసలు కాంప్రమైజ్ కాదు. మరీ ముఖ్యంగా రెండు విషయాలలో ఎవరు చెప్పినా వినదు. వాటిలో ఒకటి రెమ్యునరేషన్..రెండవది ప్రమోషన్స్. ఎంత భారీ బడ్జెట్ సినిమా అయినా, ఏ స్టార్ హీరో ఉన్నా నయనతార ప్రమోషన్స్‌కి రాదు.

    ఇప్పటికే చాలాసార్లు నిర్మాతలు నయనతారని ప్రమోషన్స్‌కి ఒప్పించాలని ట్రై చేసి ఫెయిల్ అయ్యారు. అయితే, లేటెస్ట్ టాక్ ఏంటంటే నయనతార ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొన్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందట. బాలీవుడ్‌లో దీపిక అందుకుంటున్న రెమ్యునరేషన్ 10 కోట్లు అని సమాచారం. నయనతారకి 5 కోట్లు ఉండేదట. కానీ, ఇప్పుడు 12 కోట్లు డిమాండ్ చేస్తుందని తాజా సమాచారం.

    nayanthara-demands more remunration deepika
    nayanthara-demands more remunration deepika

    Nayanthara: పాన్ ఇండియా సినిమాలకే నయన్ అందుబాటులో

    పాన్ ఇండియా సినిమాలకే నయన్ అందుబాటులో ఉండేలా ఉంది. మీడియం బడ్జెట్ సినిమాలను నిర్మించే నిర్మాతలు భయపడాల్సిందే. బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తూ చేసిన జవాన్ సినిమాకి షారుఖ్ ఖాన్ 10 కోట్ల రూపాయలు నయన్ కి రెమ్యునరేషన్ ఇచ్చారట. దాంతో థగ్స్ సినిమాకి ఏకంగా 12 కోట్లు అడిగిందట. అది మరీ ఎక్కువని సైలెంట్ అయిన నిర్మాతలు త్రిష వైపు టర్న్ తీసుకున్నారట.

    బాలీవుడ్‌లో హైయ్యెస్ట్ రెమ్యునరేషన్ దీపకదే ఉంది. ఆమె ఒక్కో సినిమాకి 10 కోట్లు అందుకుంటుంది. అంతకంటే ఎక్కువ రెమ్యునరేషన్ అందుకోవాలని నయనతార ఆలోచిస్తుందట. అదే జరిగితే, ఇటు సౌత్‌లో అటు నార్త్‌లో నయన్‌దే హైయ్యెస్ట్ రెమ్యునరేషన్ అవుతుంది. కానీ, అంత ఇస్తారా..? అనేది ఇప్పుడు నెట్టింట నడుస్తున్న హాట్ టాపిక్. ఏదేమైనా బాలీవుడ్‌లో ఒక్క సినిమా చేసిన నయనతార ఏకంగా దీపిక పదుకొన్ నే తొక్కేయాలని చూస్తుంది.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.