Wed. Feb 11th, 2026

    Nagarjuna: టాలీవుడ్ మన్మధుడు, కింగ్ నాగార్జున తాజాగా “ఆరోజు బీరు తాగి, బిర్యాని తిన్నా..అప్పుడే ఆ ఆలోచన వచ్చింది..అంటూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ నాగార్జున ఎందుకు ఇలా మాట్లాడారు..అసలు విషయం ఎంటో కథనంలోకి వెళ్ళి తెలుసుకుందాం. కెరీర్ ప్రారంభంలో నాగార్జునకి సరైన హిట్స్ లేవు. ఆ తర్వాత కథల విషయంలో జాగ్రత్తలు తీసుకొని హిట్స్ అందుకుంటూ వచ్చారు.

    శివ నాగార్జున కెరీర్‌లో ఎప్పటికీ ఓ మైల్ స్టోన్‌లా మిగిలిపోయే సినిమా. ఆ తర్వాత నాగార్జున వరుసగా మంచి హిట్స్ అందుకున్నారు. కమర్షియల్ హీరోగా కెరీర్ ఊపులో ఉండగానే ఎవరూ ఊహించని విధంగా అన్నమయ్య సినిమా చేయడం. ఈ సినిమా చేస్తున్నప్పుడు నాగార్జున ఎన్నో నెగిటివ్ కామెంట్స్ విన్నారు. అయినా రాఘవేంద్ర రావు మీద నమ్మకంతో అన్నమయ్య చేసి కెరీర్‌లో మళ్ళీ ఇలాంటి సినిమా చేయలేరేమో అనే మంచి కామెంట్స్ అందుకున్నారు.

    nagarjuna-vairal-comments-on-shirdi-sai-movie
    nagarjuna-vairal-comments-on-shirdi-sai-movie

    Nagarjuna: శిరిడి సాయిబాబా పాత్రలో నటించాలనే ఆలోచన కలిగిందట. 

    అన్నమయ్యగా నాగార్జున చేసిన పర్ఫార్మెన్స్ మహాద్భుతం. ఆ తర్వాత శిరిడి సాయి సినిమా చేశారు. అయితే, ఈ సినిమా చేయాలనే ఆలోచన మాత్రం ముందు వచ్చింది నాగార్జునకేనట. సోమవారం నుంచి శనివారం వరకూ నాగార్జున తిండి విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. అన్నీ లిమిట్‌గా తీసుకుంటారు. ఒక్క ఆదివారం మాత్రం నాగార్జునని ఎవరూ ఆపలేరు. ఆ ఒక్కరోజు మాత్రం ఆయనకి నచ్చిన తిండి నచ్చినంత తింటారు. అలాగే ఒక ఆదివారం బిర్యానీ తిని ఫుల్లుగా బీరు తాగి ఉన్నారట.

    ఆ సమయంలో నాగార్జునకి శిరిడి సాయిబాబా పాత్రలో నటించాలనే ఆలోచన కలిగిందట. అదే మాట దర్శకుడు రాఘవేంద్ర రావుకి చెప్తే ఆయన కూడా సరే అని చెప్పారట. ఆ తర్వాత నాగార్జున శిరిడీకి వెళ్ళి సాయిబాబాని దర్శించుకొని రావడం, శిరిడి సాయి సినిమా చేయడం జరిగాయని నాగార్జున చెప్పారు. ఈ భక్తి ప్రధానమైన చిత్రం చేయడానికి అసలు నాగార్జున ఏ సమయంలో డిసైడయ్యారో చెప్పి అందరినీ ఆశ్చర్యపరచారు.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.