Mansoor Ali Khan : మళ్లీ రచ్చ మొదలెట్టిన మన్సూర్ అలీఖాన్..త్రిష, చిరంజీవిపై పరువునష్టం కేసు?

Mansoor Ali Khan : తమిళ సీనియర్ నటుడు మన్సూర్ అలీఖాన్ పేరు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది. నటి త్రిషపై మన్సూర్ చేసిన కొంట్రవర్సీ కామెంట్స్ పై చిత్ర పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలు, నెటిజెన్స్, త్రిష అభిమానులు తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. మన్సూర్ మాట్లాడిన వీడియో నెట్టింట్లో వైరల్ కావడంతో త్రిష కూడా ఘాటుగానే స్పందించింది. సోషల్ మీడియా పేజీలో మన్సూర్ వ్యాఖ్యలను తప్పుబట్టింది. స్త్రీలను కించపరిచే విధంగా మాట్లాడిన మన్సూర్ తో మళ్ళీ కలిసి నటించేది లేదని చెప్పేసింది త్రిష. అంతేకాదు అతనిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ విషయంలో టాలీవుడ్ కోలీవుడ్ అన్న తేడా లేకుండా అందరూ త్రిష కు సపోర్టుగా నిలిచారు. నటి ఖుష్బూ, చిరంజీవి సహా పలువురు సోషల్ మీడియాలో మన్సూర్ పై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

mansoor-ali-khan-going-to-file-defamation-case-against-trisha-and-chiranjeevi

అయితే మొదట్లో తను తప్పుగా మాట్లాడలేదని త్రిష కు సారీ చెప్పేది లేదని మన్సూర్ తెలిపారు. అంతేకాదు తమిళనాడు డీజీపీకి, జాతీయ మహిళా కమిషన్ కు మన్సూర్ పై ఫిర్యాదు చేశారు. చెన్నై పోలీసులు మన్సూర్ పై రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం ఈ విషయం సీరియస్ కావడంతో పంతం వీడి త్రిషకు క్షమాపణలు చెప్పారు.’తప్పు చేయడం మానవ సహజం, క్షమించడం అనేది దైవం చూసుకుంటుంది’ అని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. త్రిష ఆ సారీ ని యాక్సెప్ట్ చేసి అక్కడితో ఈ గొడవకు ఫుల్ స్టాప్ పెట్టింది. దీంతో ఈ గొడవ ఇక్కడితో ముగిసిపోయిందని అంతా అనుకున్నారు. కానీ తాజాగా మళ్లీ మన్సూర్‌ మరో రచ్చ మొదలుపెట్టాడు.

mansoor-ali-khan-going-to-file-defamation-case-against-trisha-and-chiranjeevi

తాజాగా ఖుష్బు, త్రిష, చిరంజీవిలపై మన్సూర్‌ పలు కేసులు నమోదు చేసేందుకు రెడీ అయ్యారు . పరువునష్టం, పరిహారం, క్రిమినల్, సివిల్ దావా, ముందస్తు అల్లర్లు, ప్రజా శాంతికి విఘాతం కలిగించడం, రెచ్చగొట్టడం వంటి కేటగిరీల కింద కేసు నమోదు చేయబోతున్నట్లు మన్సూర్ ప్రకటించారు. కొన్ని ఆధారాలతో తన లాయర్ గురు ధనంజయన్ సోమవారం కోర్టులో కేసు వేయనున్నట్లు చెప్పారు. ఖుష్బు, త్రిష, చిరంజీవిలకు నోటీసులు జారీ చేస్తానని ప్రకటించారు.మరి ఈ వివాదం మళ్లీ ఏ మలుపు తిరుగుతుందో చూడాల్సిందే.

 

Sri Aruna Sri

Recent Posts

Pawan Kalyan: ఉస్తాద్ భగత్‌సింగ్ బ్రేకీవెన్ కూడా కష్టమా?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రతీ ఒక్కరిలో ఉండే ఆతృత, ఆసక్తి ఊహించలేనిది. ఎన్ని సినిమాలు బాక్సాఫీస్…

9 hours ago

Kadiri Narasimha Swamy: కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

*బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు *ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక Kadiri Narasimha Swamy: కదిరి, మార్చి…

2 weeks ago

Pawan Kalyan: హైదరాబాద్‌లో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా?

Pawan Kalyan:హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…

3 weeks ago

Ram Charan: ‘పెద్ది’ ప్రమోషన్స్ నెక్స్ట్ లెవల్..క్లారిటీ ఇచ్చిన మేకర్స్ !

Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్‌డేట్స్ రావడం లేదని…

3 weeks ago

Mega 158: మెగా 158లో పవన్ భక్తుడు..అసలు నిజం ఇదే!

Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…

3 weeks ago

Puranapanda Srinivas: హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

Puranapanda Srinivas: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి…

3 weeks ago

This website uses cookies.