Butter Milk: సాధారణంగా ప్రతి ఒక్కరూ కూడా రోజువారి ఆహారంలో భాగంగా పెరుగు తప్పనిసరిగా ఉండేలా చూసుకుంటారు. అయితే ఈ మధ్యకాలంలో చాలామంది పెరుగు తినడం కన్నా ఆ పెరుగును బాగా చిలకొట్టి మజ్జిగ తయారు చేసుకునే తినడానికి ఇష్టపడుతున్నారు. ఇలా మజ్జిగ తాగటం ఆరోగ్యానికి ఎంతో మంచిది. పెరుగు తీసుకోవడం వల్ల అధిక శరీరం బరువు పెరుగుతారనే అపోహ నుంచి కూడా ఈ మజ్జిగ బయటపడేస్తూ ఉంటాయి. ఇలా మజ్జిగ ఆరోగ్యానికి ఎంతో మంచిది అయితే మంచిది కదా అని అతిగా తీసుకుంటే కనుక ప్రమాదంలో నిపుణులు చెబుతున్నారు.
మజ్జిగలో లాక్టోజ్ ఎంజైమ్ ఉంటుంది అయితే ఇది అందరి శరీరంలోను పెద్ద ఎత్తున ఉత్పత్తి కాదు తద్వారా మజ్జిగను ఎక్కువగా తీసుకోవడం వల్ల కొంతమందిలో తీవ్రమైనటువంటి కడుపునొప్పి తల తిరగడం వాంతులు జరగడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటివారు మజ్జిగను తీసుకోకపోవడం ఎంతో మంచిది. ఇక మజ్జిగను అధికంగా తాగేవారు ఉప్పు కూడా వేసుకుంటూ ఉంటారు అయితే ఉప్పు అధికంగా వేసుకోవడం వల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది కనుక చాలా తక్కువ పరిమాణంలో ఉప్పు వేసుకొని మజ్జిగ తాగడం మంచిది.
ఇక చాలా మందిలో మజ్జిగ తాగగానే శరీరంపై ఎర్రని దద్దుర్లు ఏర్పడుతూ ఉంటాయి. ఇలా చర్మంపై దద్దుర్లు ఏర్పడేవారు మజ్జిగ తాగకపోవడమే ఎంతో మంచిది. ఇలా వివిధ రకాల సమస్యలతో బాధపడేవారు మజ్జిగ తాగకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇక ఇలాంటి సమస్యలు లేని వారు రోజుకు ఒక గ్లాస్ మజ్జిగ తాగటం వల్ల ఎంతో మంచిదని అంతేకాకుండా అధిక మొత్తంలో మజ్జిగ తీసుకుంటే కనుక ప్రమాదంలో పడినట్లేనని తెలియజేస్తున్నారు. ఇలా రోజుకు ఒక గ్లాస్ మజ్జిగ తాగటం వల్ల మనం తీసుకున్నటువంటి ఆహారం తేలికగా జీర్ణం అవ్వడమే కాకుండా ఏ విధమైనటువంటి అజీర్తి సమస్యలు లేకుండా కాపాడుతుంది.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.