Sat. Nov 15th, 2025

    Tollywood : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎంబి 28 శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. పూజా హెగ్డే, శ్రీలీల మహేష్ బాబుతో రొమాన్స్ చేయబోతున్నారు. గతంలో మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన అతడు, ఖలేజా ఆశించిన సక్సెస్ సాధించలేకపోయాయి. అయినా వీరి కాంబోలో మూడవ సినిమా రూపొందడం హాట్ టాపిక్. దీనికి కారణం మహేష్ బాబుకి ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడితో మళ్ళీ సినిమా చేయడానికి ఇష్టపడరు.

    కానీ, త్రివిక్రమ్ అంటే ఎందుకో మహేష్ ఆసక్తి చూపించారు. ఈ సినిమాతో మహేష్‌కి ఎట్టి పరిస్థితుల్లో భారీ హిట్ ఇవ్వాలి. అదే ప్లాన్‌తో గురూజీ ఈ సినిమాను పక్కా స్క్రిప్ట్‌తో రూపొందిస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు. 2024 సంక్రాంతి బరిలో మహేష్ మూవీ రిలీజ్ కాబోతోంది. మహేష్ నటించిన గత చిత్రాలు కొన్ని ఇలాగే పెద్ద పండుగకి వచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళు రాబట్టాయి. సరిలేరు నీకెవ్వరు సినిమా కూడా అల వైకుంఠపురములో సినిమాతో పోటీపడి భారీ హిట్ సాధించింది.

    Mahesh, Charan, Kamal are getting ready in tollywood-by 2024
    Mahesh, Charan, Kamal are getting ready in tollywood-by 2024

    Tollywood : మహేష్ ఈ పోటీని ఎలా తట్టుకుంటారో..?

    అయితే, వచ్చే సంక్రాంతికి మహేష్ బాబు గట్టి పోటీని ఎదుర్కోబోతున్నాడు. క్రియేటివ్ జీనియస్ శంకర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో దిల్ రాజు నిర్మిస్తున్న పాన్ ఇండియన్ సినిమా ఆర్సీ 15 2024 సంక్రాతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అలాగే, శంకర్ – కమల్ హాసన్‌ల ఇండియన్ 2 కూడా ఇదే సంక్రాంతికి రిలీజ్ చేయాలని సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ రెండు పాన్ ఇండియన్ సినిమాలతో పాటుగా పవన్ కళ్యాణ్ – క్రిష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమా కూడా అదే సంక్రాంతికి వచ్చే అవకాశాలున్నాయి. ఇవి కాకుండా మరికొన్ని భారీ చిత్రాలు 2024 సంక్రాంతికి రావడానికి రెడీ అవుతున్నాయి. మరి మహేష్ ఈ పోటీని ఎలా తట్టుకుంటారో చూడాలి.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.