Lavanya tripathi : సినీ సెలబ్రిటీలకు డివోర్స్ కామన్ అయిపోయాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు కూడా కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకుంటున్నారు. సమంత నాగచైతన్య, ధనుష్ ఐశ్వర్య రాజేష్, అమలా పాల్ ఇలా ఇండస్ట్రీ లో చాలా మంది సెలబ్రేటీలు డివోర్స్ తీసుకుని వారి లైఫ్ ని సింగల్ గా గడిపేస్తున్నారు. బాలీవుడ్ లోనూ కొన్ని జంటలు విడిపోయ్యాయి. కొంతమంది మళ్లీ పెళ్లి చేసుకుని హ్యాపీ గా ఉంటున్నారు. మరి కొంతమంది రివర్స్ తీసుకున్న కూడా అధికారికంగా ప్రకటించకుండా విడివిడిగా ఉంటున్నారు.
మెగా ఫ్యామిలీలోనూ ఇలాంటి స్టోరీలు చాలానే ఉన్నాయి. ఈమధ్యనే నాగబాబు కూతురు నిహారిక భర్త చైతన్య కు డివోర్స్ ఇచ్చి సింగిల్ గా తన కెరీర్ లో బిజీ అయిపోయింది. మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు కూడా రెండో పెళ్లి చేసుకుని మళ్లీ తన భర్తతో విడిగా ఉంటుంది. కొన్నాళ్ళు వీళ్లిద్దరూ దూరంగా ఉన్నప్పటికీ తాజాగా మళ్లీ ఈ జంట కలవబోతున్నట్టు న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదంతా కూడా మెగా కోడలు లావణ్య త్రిపాఠీ వచ్చిన వేళా విశేషం అంటూ మెగా ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.
గత కొంత కాలంగా మెగాస్టార్ చిన్న కూతురు శ్రీజ కూడా తన రెండో భర్త కల్యాణ్ దేవ్ తో విడిగా ఉంటోంది. అయితే వీరు విడాకులు తీసుకున్నట్లు ఇప్పటి వరకు అనౌన్స్ చేయలేదు. ఇటలీలో జరిగిన వరుణ్ తేజ్ వివాహంలోనూ కల్యాణ్ దేవ్ కనిపించలేదు. అయితే ఏ పండుగ వచ్చినా కళ్యాణ్ దేవ్ మాత్రం తన కూతురిని ఇంటికి తీసుకెళ్లి స్పెండ్ చేస్తున్నాడు. కలిసి ఉన్నంత కాలం శ్రీజా మొదటి భర్త కూతురిని కూడా కళ్యాణ్ దేవ్ బాగానే చూసుకునేవాడు. ఇద్దరు కూతుర్లతో దిగిన ఫోటోలను కళ్యాణ్ దేవ్ సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ తో పంచుకున్నాడు. అయితే తాజాగా శ్రీజ , కళ్యాణ్ దేవ్ మళ్లీ కలవబోతున్నారు అనే ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీ లో వినిపిస్తుంది.
మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఈ ఇద్దరినీ కూర్చొబెట్టి..మళ్లీ ఒక్కటి చేసే పనిలో ఉన్నారని టాక్ వినిపిస్తుంది. అయితే ఈ విషయం తెలుసుకన్న ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.. ఇదంతా కోడలు లావణ్య త్రిపాఠి వచ్చిన వేళా విశేషం అంటూ నెట్టింట్లో కామెంట్స్ చేస్తున్నారు. కొత్త కోడలు వచ్చింది.. ఈ జంట ఒక్కటి కాబోతున్నారంటూ సంతోష పడుతున్నారు. మరి ఈ విషయం ఎంత వరకు వాస్తవమో వెయిట్ చేసి చూడాల్సిందే.