Health Tips: చలికాలం మొదలవడంతో చాలామంది దగ్గు జలుబు వంటి సమస్యలతో బాధపడటం సర్వసాధారణంగా జరుగుతుంది. వాతావరణంలోని పరిస్థితులన్నీ కూడా ఒక్కసారిగా మారిపోవడంతో ప్రతి ఒక్కరు కూడా ఈ విధమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అందుకే చలికాలంలో ఈ విధమైనటువంటి సమస్యల బారిన పడుకుండా ఉండటం కోసం ఎన్నో జాగ్రత్తలను తీసుకుంటారు. అయితే ఎక్కువగా జలుబు దగ్గు సమస్యతో బాధపడేవారు ఎలాంటి మందులు వాడిన పెద్దగా ప్రయోజనాలు కనిపించవు.
చలికాలంలో దగ్గు జలుబు వంటి సమస్యలు అధికం కావడం వల్ల మన గొంతులో కఫం ఏర్పడుతుంది. ఇలా ఏర్పడినటువంటి కఫాన్ని చాలామంది ఎప్పటికప్పుడు బయటకు ఉమ్మి వేయకుండా మింగుతూ ఉంటారు. కానీ ఇలా చేయడం వల్ల దగ్గు జలుబు సమస్యలు మాత్రమే కాకుండా ఊపిరితిత్తులు కూడా ఇన్ఫెక్షన్ కి గురి అయ్యే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ కావడంతో శ్వాసకోస సంబంధిత వ్యాధులు కూడా వస్తాయి. కొన్నిసార్లు మనం తీసుకున్నటువంటి ఆహారం ఆహారవాహికలో కాకుండా వాయునాళంలోకి ముక్కలు ముక్కలుగా వెళ్లిపోవటం వల్ల ఇన్ఫెక్షన్ మరింత ఎక్కువ జరుగుతుంది.
అందుకే ఏర్పడినటువంటి కఫం ఎప్పటికప్పుడు ఉమ్మి వేయటం వల్ల జలుబు దగ్గు సమస్య కూడా తొలగిపోవడమే కాకుండా తలబారం కూడా తగ్గుతుంది. చలికాలంలో వచ్చే దగ్గు జలుబు ఇన్ఫెక్షన్ వంటి వాటిని తగ్గించుకోవడానికి రోజులో మూడు సార్లు గ్రీన్ టీ తాగటం వల్ల ఈ ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గుతుంది గ్రీన్ టీ లో ఉన్నటువంటి రోగనిరోధక శక్తి ఏర్పడినటువంటి బ్యాక్టీరియా కఫం వంటి వాటిని పూర్తిగా నశింప చేస్తుంది. ఇలా వేడివేడిగా మూడుసార్లు గ్రీన్ టీ తాగడం వల్ల ఈ సమస్య నుంచి పూర్తిగా మనం ఉపశమనం పొందవచ్చు.