Tue. Feb 10th, 2026

    Kriti Sanon : బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్ లలో కృతి సనన్ ఒకరు. ఈ బ్యూటీ అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. నటన పరంగానే కాదు ఫ్యాషన్ పరంగాను ఈ అమ్మడికి మంచి పేరుంది. . ఎలాంటి దుస్తులను అయినా ఆకర్షణీయంగా మార్చగల అద్భుతంగా టాలెంట్ కృతి సనన్ సొంతం. ప్రస్తుతం అదే చేసి చూపిస్తోంది ఈ చిన్నది.

    kriti-sanon-gorgeous-looks-in-blue-colour-net-saree
    kriti-sanon-gorgeous-looks-in-blue-colour-net-saree

    దీపావళి ఫెస్టివల్ సీజన్ కోసం ప్రముఖ బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన నీలిరంగు చీర కట్టుకుని వావ్ అనిపించి కృతి. కృతి ఈ చీరలో దీపావళి పండుగ కళ శోభను తీసుకువచ్చింది. చీరకట్టులో నడుము అందాలను చూపిస్తూ కుర్రాళ్ల హృదయాలను దోచేసింది.

    kriti-sanon-gorgeous-looks-in-blue-colour-net-saree
    kriti-sanon-gorgeous-looks-in-blue-colour-net-saree

    “బ్లూ బటర్‌ఫ్లై ఫర్ లైఫ్” అనే క్యాప్షన్‌తో కృతి ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఉల్లిపొర చీరతో దిగిన ఫోటోలను వరుసగా అప్‌లోడ్ చేసి తన అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చింది. ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రాకు కృతి మ్యూజ్ గా వ్యవహరించింది. మిరుమిట్లు గొలిపే నీలిరంగు చీరను ధరించింది, ఎంతో అద్భుతంగా మెరిసిపోయింది. ఆమె స్టైలింగ్‌ను ప్రముఖ ఫ్యాషన్ స్టైలిస్ట్ సుకృతి గ్రోవర్ నేర్పుగా చేసింది.

    kriti-sanon-gorgeous-looks-in-blue-colour-net-saree
    kriti-sanon-gorgeous-looks-in-blue-colour-net-saree

    క్లిష్టమైన సీక్విన్ ఎంబ్రాయిడరీ, మెరిసే అలంకారాలు ఉన్న నీలిరంగు నెట్ చీరకు జోడీగా హాల్టర్ నెక్‌తో అలంకరించబడిన బ్లౌజ్‌ వేసుకుని ఎంతో ఆకర్షణీయంగా కనిపించింది. ఈ చీరకు తగ్గట్లుగా జత డైమండ్ స్టడ్ చెవిపోగులు, వేళ్లకు ఉంగరాలు, హైహీల్స్‌తో తన రూపాన్ని స్టైలింగ్ చేస్తూ, తన దుస్తులను మెరిసేలా చేయడానికి ఆమె తన ఉపకరణాలను కనిష్టంగా ఉంచుకుంది.

    kriti-sanon-gorgeous-looks-in-blue-colour-net-saree
    kriti-sanon-gorgeous-looks-in-blue-colour-net-saree

    మేకప్ ఆర్టిస్ట్ ఆదిత్య శర్మ కృతి అందాలకు మెరుగులు దిద్దాడు. బ్లూ ఐషాడో, మస్కరా,స్మోకీ కాజల్, న్యూడ్ లిప్‌స్టిక్‌తో మెస్మెరైజింగ్ లో ఈ బ్యూటీ ఆదరగొట్టింది. హెయిర్‌స్టైలిస్ట్ ఆసిఫ్ అహ్మద్ , కృతి హెయిర్ ను స్టైల్ చేసి, ఎత్నిక్ రూపాన్ని అందించాడు.

    kriti-sanon-gorgeous-looks-in-blue-colour-net-saree
    kriti-sanon-gorgeous-looks-in-blue-colour-net-saree