Sat. Jul 12th, 2025

    Kannappa: మంచు విష్ణు కి తీవ్రంగా గాయాలైనట్టు తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గతంలోనూ ఇలాగే షూటింగ్ సమయంలో విష్ణు గాయాలపాలైన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడేమైంది..అసలు ఎందుకు గాయాలైయ్యాయో వార్తా సారాంశంలో చూద్దాం. ప్రస్తుతం మంచు విష్ణు ‘కన్నప్ప’ అనే టైటిలో భారీ బడ్జెట్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఫిల్మ్ సర్కిల్స్ లో అందిన సమాచారం మేరకు ఇప్పుడు ఈ సినిమా చిత్రీకరణ న్యూజిలాండ్ లో జరుగుతోందట.

    ‘కన్నప్ప’ సినిమాలో శివుడి పాత్రలో ప్రభాస్, పార్వతీ దేవిగా నయనతార నటిస్తున్నారట. పాన్ ఇండియా చిత్రంగా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని మంచు విష్ణు నిర్మిస్తున్నాఉ. అయితే, షూటింగ్ జరుగుతున్న సమయంలో ప్రమాద వశాత్తు డ్రోన్ కెమెరా వచ్చి విష్ణు మీద పడినట్టుగా సమాచారం. వెంటనే యూనిట్ సభ్యులు వచ్చి విష్ణుని పక్కకి లాగారట.

    kannappa- Manchu Vishnu injured in shooting..Mohan Babu's family in shock..!
    kannappa- Manchu Vishnu injured in shooting..Mohan Babu’s family in shock..!

    Kannappa: విష్ణుని ఆసుపత్రికి తీసుకెళ్ళినట్టుగా సమాచారం. 

    కొద్దిపాటి గాయాలైనట్టుగా తెలుస్తోంది. చిత్రీకరణ నిలిపివేసి యూనిట్ సభ్యులు మంచు విష్ణుని ఆసుపత్రికి తీసుకెళ్ళినట్టుగా సమాచారం. చికిత్స చేసిన డాక్టర్లు ఆయనకి ఏమీ ప్రమాదం లేదని, చిన్నపాటి దెబ్బలే తగిలాయని.. అంతా బాగానే ఉందని చెప్పారట. దాంతో అటు మోహన్ బాబు ఫ్యామిలీ, ఇటు అభిమానులు ఊపిరి పీల్చుకున్నారని నెట్టింట ఓ వార్త హల్‌చల్ చేస్తోంది.

    kannappa- Manchu Vishnu injured in shooting..Mohan Babu's family in shock..!
    kannappa- Manchu Vishnu injured in shooting..Mohan Babu’s family in shock..!

    మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. బాలీవుడ్ దర్శకుడు ముకేశ్ కుమార్ ‘కన్నప్ప’ చిత్రాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్, నయనతార నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. గత కొంతకాలంగా మంచు హీరోలకి హిట్ దక్కడం లేదు. అయినా ధైర్యంగా భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించడానికి వెనకాడటం లేదు. చూడాలి మరి కన్నప్ప సినిమాతో అయినా విష్ణు హిట్ అందుకుంటాడేమో.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.