Political: పొత్తులపై క్లారిటీ ఇచ్చిన జనసేనాని… అన్ని సీట్లు ఇస్తేనే

Political: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాబోయే ఎన్నికలలో ఎలా అయినా అసెంబ్లీలో అడుగుపెట్టాలని గట్టిగా కోరుకుంటున్నారు. అలాగే వైసీపీని గద్దె దించాలని భావిస్తున్నారు. కచ్చితంగా జగన్ రెడ్డి ని అధికారానికి దూరం చేస్తానని పవన్ కళ్యాణ్ గట్టిగా చెబుతున్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం పవన్ కళ్యాణ్ దమ్ముంటే ఒంటరిగా పోటీ చేసి తమతో ఫైట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. కాని పవన్ కళ్యాణ్ మాత్రం వ్యూహాత్మకంగా వైసీపీ చాలెంజ్ కి రెస్పాండ్ కాకుండా ఏం చేస్తే వైసీపీని అధికారానికి దూరం చేయవచ్చు అనేది ఆలోచిస్తూ ఆ దిశగా పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పడం ద్వారా టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

అయితే అది ప్రస్తుతం తమతో కలిసి ఉన్న బీజేపీ పార్టీతో కలిసి ఉంటుందా లేదా జనసేన మాత్రమే టీడీపీతో కలిసి వెళ్తుందా అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇదిలా ఉంటే తాజాగా శ్రీకాకుళంలో రణస్థలం వేదికగా నిర్వహించిన యువశక్తి సభలో పవన్ కళ్యాణ్ పొత్తులపై తన వైఖరిని స్పష్టం చేశారు. ఒక దుర్మార్గమైన వ్యక్తిని అధికారంలో నుంచి దించడానికి అవసరానికి తగ్గట్లు విభేదించే వారితో కూడా కలిసి ప్రయాణం చేయాల్సిన అవసరం వస్తుందని తెలిపారు. అలాగే టీడీపీతో పొత్తుతో వెళ్ళాలా లేదా ఒంటరిగా పోటీ చేయాలా అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుందని తెలిపారు.

మన గౌరవానికి ఏ మాత్రం భంగం కలిగించకుండా సీట్లు ఇస్తే పొత్తుతో వెళ్తానని తేల్చి చెప్పారు. ఒంటరిగా పోటీ చేసి ఇప్పటికే ఒకసారి వీరమరణం పొందానని, అయితే ఈ సారి ప్రజలని మంచి పాలనని అందించడానికి తాను పొత్తులతో వెళ్ళడానికి సిద్ధమే అని చెప్పారు. అదే సమయంలో ప్రజలు అండగా నిలబడి కచ్చితంగా తనకి అధికారం అప్పగిస్తారు అనే నమ్మకాన్ని ఇస్తే కచ్చితంగా ఒంటరిగా పోటీ చేస్తానని క్లారిటీ ఇచ్చారు.

అలాగే పొత్తు విషయంలో కూడా టీడీపీ పార్టీకి తన బలం 50 నుంచి 55 స్థానాలు అని చెప్పకనే చెప్పారు. ఆ రేంజ్ లో సీట్లు ఇచ్చి, అధికార భాగస్వామ్యం ఇచ్చి గౌరవాన్ని ఇస్తే పొత్తు పెట్టుకుంటా అని ఈ యువశక్తి సభ ద్వారా చెప్పారు. అలాగే అభిమానులని తగ్గించే పనులు తాను ఎప్పటికి చేయనని, కచ్చితంగా మీరు కోరుకుంటే తాను ముఖ్యమంత్రి అవుతానని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. మరి పవన్ కళ్యాణ్ ఇచ్చిన కౌంట్ సీట్ల విషయంలో టీడీపీ ముందుకొచ్చి అలాగే తాను కోరుకున్న గౌరవప్రదమైన స్థానం ఇస్తుందా లేదా అనేది వేచి చూడాలి.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Ananya Nagalla: “లీసా” నా కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది..

Ananya Nagalla: యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ల హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం "లీసా". వెంకట్ దుగ్గిరెడ్డి (యూఎస్ఏ),…

9 hours ago

Prabhas-Spirit: సందీప్ రెడ్డి వంగ రేంజ్‌ ఇది..

Prabhas-Spirit: ప్రస్తుతం మన పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాలలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న సినిమా స్పిరిట్. కాప్…

2 days ago

ALLU ARJUN: AA22 టైటిల్ “రాకా”..ఇది ఎవరూ ఊహించనిది!

ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…

1 week ago

Ram Charan: ‘పెద్ది’ కథకి స్పూర్తి ఆమిర్ ఖాన్ సినిమాలేనా?

Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…

1 week ago

Chiranjeevi: విశ్వంభర మరింత ఆలస్యం..ఆ సినిమాలా అవుతుందా?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…

1 week ago

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…

2 weeks ago

This website uses cookies.