Araku Coffee: కాఫీ తాగడం మన రోజువారీ జీవితంలో చాలా సాధారణమైన అలవాటు. ఇండియాలో కోట్లాది మంది తమ లైఫ్ లో రోజుకి ఒక కాఫీ అయినా తాగుతారు. కాఫీ తాగితే ఇన్ స్టంట్ ఎనర్జీ వస్తుందని అందరూ భావిస్తారు. అందుకే దానిని అలవాటుగా మార్చుకుంటారు. ఇక టీ, కాఫీ వ్యాపారంతోనే కోట్లు గడించిన వారు ఇండియాలో ఉన్నారు. కాఫీ డే షాపులు ఇండియాలో ఎంత ఫేమస్ అనేది అందరికి తెలిసిందే. అలాగే ఇరానీ టీకి కూడా మంచి గిరాకీ ఉంది. ఈ కాఫీ, టీల గురించి ఇండియాలో పాటలు కూడా ఫేమస్ అయ్యాయి.
అయితే కాఫీ అయినా, టీ అయినా మామూలుగా అయితే 10 రూపాయిల ధర ఉంటుంది. అదే కార్పొరేట్ కాఫీ స్టాల్స్ లో అయితే గట్టిగా వేసుకుంటే 80 రూపాయిల వరకు ఉంటుంది. అయితే స్టేచర్ బట్టి కాఫీ తాగే ప్లేస్ మారుతుంది. ఇండియాలో కాఫీ షాపులు చాలా ఉన్నాయి. హ్యాంగోవర్ స్పాట్స్ గా వీటిని ఉద్యోగులు భావిస్తూ ఉంటారు. కాఫీ తాగి కాస్తా సేదతీరే ప్రయత్నం చేస్తారు. ఇండియాలో కాఫీ అంటే కర్ణాటకలో ఊటీ చాలా ఫేమస్ అక్కడ కాఫీ ఫార్మ్స్ చాలా ఉంటాయి. పదుల సంఖ్యలో రైతులు కాఫీ తోటల మీద ఆధారపడి బ్రతుకుతూ ఉంటారు. అక్కడ కాఫీకి మంచి డిమాండ్ ఉంది.
అయితే ఇప్పుడు ఇండియాలోనే కాకుండా విదేశాలలో కూడా మరో కాఫీకి మంచి డిమాండ్ ఉంది. అదే ఏపీలోని అరుకు కాఫీ. ఈ కాఫీకి అంతర్జాతీయంగా డిమాండ్ ఉందంటే నమ్మడం కష్టం. గిరిజన రైతులు పండించే ఈ కాఫీ తోటల నుంచి గింజలని సేకరించి వాటిని ఇన్ స్టెంట్ కాఫీ పౌండర్స్ గా తాయారు చేసి ప్యాకింగ్ చేసి బెంగుళూరు నుంచి విదేశాలకి తరలిస్తున్నారు. ఆరుకు కాఫీ అనే బ్రాండ్ తోనే ఈ కాఫీ పౌడర్ ని విదేశాలకి ఎగుమతి చేస్తున్నారు. జపాన్, బ్రెజిల్, అమెరికా లాంటి దేశాలలో అరుకు కాఫీకి మంచి డిమాండ్ ఉంది. ఎంత రేటు అయినా పెట్టి కొనేందుకు అక్కడి ప్రజలు రెడీఅవుతున్నారు.
అలాగే జపాన్ లో కాఫీ షాపులలో ప్రత్యేకంగా అరుకు కాఫీ పేరుతో కప్పులలో విక్రయిస్తున్నారు. ఇక ఈ కాఫీ ధర ఎంతో తెలిస్తే కచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇండియన్ కరెన్సీలో కప్పు కాఫీ ధర అక్షరాల 637 రూపాయిలుగా ఉంది. జపాన్ లో ఇంత ధర పెట్టుకొని కొనడానికి అక్కడి ప్రజలు పెద్దగా వెనుకాడరు. వారి కరెన్సీలో కాఫీ ధర ఏడు డాలర్లు మాత్రమే. సేంద్రియ పద్దతిలో అటవీప్రాంతంలో ఈ కాఫీ పంటని సాగు చేయడంతో వీటికి డిమాండ్ ఉన్నట్లు తెలుస్తుంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.