Health care: మన శరీరంలోని జీవక్రియలు సక్రమంగా జరగాలి అంటే తప్పనిసరిగా పోషకాలు ఎంతో అవసరం అయితే మనం తీసుకునే ఆహారాలలో పోషక విలువలు ఉండేలా చూసుకోవాలి అయితే సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల మన శరీరంలో ఐరన్ కాల్షియం వంటి పోషకాలు లోపించి ఎన్నో ఇబ్బందులవుతాయి. ఇలా సమస్యలతో బాధపడేవారు ఆహారంతో పాటు మరి టాబ్లెట్స్ రూపంలో కూడా వీటిని తీసుకుంటూ ఉంటారు.
ఇక ఐరన్ కాల్షియం మాత్రలు ఉపయోగించేవారు ఒకేసారి రెండు టాబ్లెట్లను వేసుకుంటూ ఉంటారు అయితే ఇలా వేసుకోవడం మంచిదేనా వేసుకుంటే ఏం జరుగుతుందనే విషయాల గురించి తెలుసుకుందాం.. నిజానికి ఐరన్ క్యాల్షియం మాత్రలు ఉపయోగించేవారు రెండు టాబ్లెట్స్ ఒకేసారి వేసుకోకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా రెండు ఒకేసారి వేసుకోవడం వల్ల ఈ పోషకాలు మన శరీరానికి సరైన స్థాయిలో అందవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా క్యాల్షియం ట్యాబ్లెట్లు ఐరన్ శోషణను 40 నుంచి 60 శాతం మేర తగ్గించేస్తాయి. అంటే మీరు రెండు ట్యాబ్లెట్లను ఒకేసారి వేసుకుంటే మీరు వేసుకునే ఐరన్ ట్యాబ్లెట్లలో కేవలం 40 నుంచి 60 శాతం వరకు మాత్రమే మీ శరీరం శోషించుకుంటుందన్నమాట. కనుక ఈ రెండు ట్యాబ్లెట్లను వేసుకునేందుకు తప్పనిసరిగా 30 నిమిషాల గ్యాప్ అయినా ఉండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఐరన్ ట్యాబ్లెట్లను వాడే సమయంలో క్యాల్షియం అధికంగా ఉండే ఆహారాలను కూడా తీసుకోరాదు. లేదంటే ఐరన్ శోషణ తగ్గిపోతుంది. అలాగే ఐరన్ ను శరీరం ఎక్కువగా శోషించుకోవాలంటే ఉదయం ఖాళీ కడుపుతో ఆ ట్యాబ్లెట్లను తీసుకోవాలి. లేదంటే భోజనం చేసే ముందు వేసుకోవాలి.