Vastu Tips: సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితం కూడా పూల పాన్పు వంటిది కాదు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉంటే ఆరోగ్యపరంగా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. మరికొంతమంది ఎన్నో ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కొంటూ ఉంటారు. ఇలా ఆర్థిక సమస్యలతో అనారోగ్య సమస్యలతో బాధపడేవారు కొన్ని వాస్తు పరిహారాలను పాటించడం వల్ల కూడా ఈ సమస్య నుంచి మనం బయటపడవచ్చని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా ఈ విధమైనటువంటి సమస్యలతో బాధపడేవారు సూర్యోదయం అలాగే సూర్యాస్తమ సమయంలో కొన్ని పరిహారాలను పాటించాలి. ముఖ్యంగా సూర్యాస్తమ సమయంలో ఈ పరిహారాలను పాటించడం వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బందులు రావని మనకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. మరి సూర్యాస్తమ సమయంలో ఎలాంటి పరిహారాలు పాటించాలి అనే విషయానికి వస్తే సూర్యోదయం సూర్యాస్తమ సమయంలో సూర్య నమస్కారం ఎంతో ముఖ్యమైనదిగా పండితులు చెబుతున్నారు.
ఇక సూర్యాస్తమ సమయంలో తప్పనిసరిగా మన ఇంటిలో దీపారాధన చేయాలి అలాగే తులసి కోట వద్ద కూడా దీపారాధన చేసే తులసి మాతను పూజించడం ఎంతో మంచిది ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఇక ఎల్లప్పుడు మన ఇంట్లో సంధ్య సమయంలో వెలుతురు ఉండేలా చూసుకోవాలి కానీ చీకటిగా ఉండకూడదు ఇలా చీకటిగా ఉండటం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది చాలామంది ఇంట్లో ఒక లైట్ వేసుకొని మిగతావన్నీ కూడా ఆఫ్ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల నెగటివ్ ఎనర్జీని ఇంట్లోకి ఆహ్వానించినట్లేనని అర్థం. అందుకే సంధ్యా సమయంలో దీపారాధన చేసి ఇంట్లో లైట్స్ వేసి తలుపులు కూడా తీసి ఉండాలని పండితులు చెబుతున్నారు. అలాగే సంధ్యా సమయంలో పితృదేవతలను స్మరించుకోవడం కూడా ఎంతో ముఖ్యం పితృదేవతల ఆశీర్వాదాలు మనపై ఉంటే ఏ విధమైనటువంటి దోషాలు ఉండవని చెబుతున్నారు.