Tue. Jul 8th, 2025

    Thamalapaku: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం ఏదైనా పూజ చేస్తుంటే తప్పనిసరిగా పూజలో తమలపాకులను పెట్టడం ఆనవాయితీగా వస్తుంది. ఇలా పూజలో తమలపాకు పూజ పరిపూర్ణమవుతుంది కానీ తమలపాకు లేకుండా పూజ చేయడం వల్ల ఆ పూజ అసంపూర్ణంగానే మిగిలిపోతుందని పండితులు చెబుతున్నారు. తమలపాకు పూజలలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకొని ఉంది. అసలు పూజలో కేవలం తమలపాకు పెట్టడానికే కారణం ఏంటి అనే విషయాన్ని వస్తే…

    do-you-know-why-it-is-said-that-puja-without-betel-leaf-is-incomplete
    do-you-know-why-it-is-said-that-puja-without-betel-leaf-is-incomplete

    ఎప్పుడైతే మనం పూజలో తమలపాకు పెడతాము అప్పుడే ఆ పూజ సంపూర్ణంగా అవుతుంది తమలపాకు పాజిటివ్ వైబ్రేషన్స్ కలిగిస్తుంది అందుకే పూజ చేసే సమయంలో మనం మనసు కూడా చాలా తేలికైన భావన కలుగుతూ ఉంటుంది. అందుకే తమలపాకు తప్పనిసరిగా పెట్టాలని పురాణాలలో చెప్పబడింది. అంతేకాకుండ తమలపాకు త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణువు, శివుడిని సూచిస్తాయి.పూజా సమయంలో తమలపాకును సమర్పించడం అనేది దైవిక శక్తుల పట్ల భక్తిని వ్యక్తపరిచే శుభమైనా మార్గం అని పండితులు చెబుతున్నారు.

    కొన్ని ప్రాంతాలలో దేవుడికి హారతి ఇచ్చే సమయంలో తమలపాకుపై కర్పూరం పెట్టి వెలిగించి దేవుడికి హారతి ఇస్తారు. ఇలా హారతి ఇవ్వటం వల్ల ఇల్లు మొత్తం సానుకూల ప్రభావాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా దేవతలు రాక్షసులు సాగర మధనం చేస్తున్నటువంటి సమయంలో ఎన్నో సముద్ర గర్భం నుంచి ఉద్భవించాయి ఇలా సముద్ర గర్భం నుంచి ఉద్భవించినటువంటి వాటిలో తమలపాకు కూడా ఒకటని అందుకే దానిని దైవ సమానంగా భావించి ప్రతి ఒక్క దైవ కార్యములో అలాగే శుభకార్యంలోనూ తమలపాకులను ఉంచి పూజలు చేస్తున్నాము. అందుకే ప్రతి ఒక్క శుభకార్యంలో తమలపాకు పెట్టడం ఆనవాయితీగాను శుభ పరిణామంగాను వస్తుందని చెప్పాలి.