Heeramandi Actress : బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన హీరామండి ది డైమండ్ బజార్ సిరీస్ ఓటిటి లో సక్సెస్ ఫుల్ గా స్ట్రీమింగ్ అవుతుంది. బ్రిటిషర్లను ఎదిరించిన వేశ్యల కథను భన్సాలీ ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. భారీ తారాగణం, భారీ సెట్టింగ్స్, అద్భుతమైన స్క్రీన్ ప్లే తో డైరెక్టర్ అందరి హృదయాలను గెలుచుకున్నారు. ఈ సిరీస్ లో నటించిన ప్రతి ఒక్క స్టార్ తమ పెర్ఫార్మేన్స్ తో ప్రేక్షకులను ఫిదా చేసేశారు. వరల్డ్ వైడ్ గా మోస్ట్ వాంటెడ్ స్ట్రీమింగ్ సిరీస్ లలో హీరమండి నిలిచింది. ఈ సూపర్ హిట్ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన హీరమండీ టాపికే వినిపిస్తోంది. ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మనిషా కొయిరాలా యాక్టింగ్ మాత్రం అద్భుతః. ఆమె మల్లికా జాన్ పాత్రలో ఇరగదీసింది.
మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావు హైదరీ, రిచా చద్దా అందరూ తమ నటనతో మెప్పించారు. ఒక్కొక్కరి క్యారెక్టర్ కు అడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఇక ఇందులో మనీషా కొయిరాలా యుక్తవయసు అమ్మాయి క్యారెక్టర్ ను బాలీవుడ్ నటి అభా రతా చేసింది . ఆమె కనిపించింది తక్కువ సమయమే అయినా అందరికి గుర్తుండిపోయే క్యారెక్టర్. ఇక రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో అభా ఇండస్ట్రీ లో ఆమెకు ఎదురైన పరిస్థితుల గురించి చెప్పుకొచ్చింది. తాజాగా చేసిన కామెంట్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
ఇంటర్వ్యూలో అభా మాట్లాడుతూ.. “కొందరు నా కెరీర్ స్టార్టింగ్ లో నన్ను పరొక్షంగా ఇబ్బంది పెట్టారు..ఫోన్ చేసి మీటింగ్ ఉందని రమ్మంటారు..కానీ అది అడిషన్ కాదంటున్నారేంటీ అని డైలమాలలో పడిపోయేదాన్ని. ఎందుకో అక్కడికి వెళ్లాలనిపించేది కాదు. నాకు అసలే ధైర్యం కూడా రాలేదు. అయితే ఎవరూ నన్ను డైరెక్ట్ గా అడగలేదు. కేవలం యాక్టింగ్ గురించి మాత్రమే సలహాలు ఇచ్చేవారు. కేవలం అడిషన్లకు వెళ్లేదాన్ని. ఆ తర్వాత కాల్స్ కోసం వెయిట్ చేసే దాన్ని”అని తెలిపింది.