Guppedantha manasu serial: ఇంట్లో ఎవరూ లేకపోవడంతో కంగారు పడుతుంది దేవయాని. భర్తతో గొడవకు దిగుతుంది. అపుడే కారు వస్తుంది. అందరూ ముఖాలకు రంగు పూసుకుని వస్తారు. ఏంటి రిషి అంటూ అందరిని ప్రశ్నిస్తుంది దేవయాని. మీకు కూడా హ్యాపీ హోళీ అంటారు రిషి, వసులు. దాంతో దేవయాని కూల్ అవుతుంది. ఆ తర్వాత అందరూ ఒకరికొకరు హోళీ విషెస్ చెప్పుకుంటారు.
ఆ తర్వాత దేవయానికి అందరూ తాము చేసిన డ్యాన్స్‌ల గురించి చెప్తారు. ఈ రంగులు నీ స్కిన్‌కు పడవు. నువ్ వెళ్లి ఫ్రెష్ అవు అని పంపిస్తుంది రిషిని. అలా అందరూ ఒక్కొక్కరుగా అక్కడినుంచి వెళ్లిపోతారు. ‘వసుధారా.. ఈ రంగులు కడిగితే పోతాయేమో కానీ.. ఈ ఆనందం ఇలాగే ఉండిపోతుంది’ అని సంతోషపడతాడు రిషి. అపుడే వసు కూడా తన ఆనందాన్ని వ్యక్తపరుస్తుంది. అలా వసు, రిషిలు మాట్లాడుకుంటుండగా దేవయాని చాటుగా వింటూ కుళ్లుకుంటుంది.
Guppedantha manasu serial: అపుడే రిషి దేవయానిని గమనిస్తాడు. ఏదో తట్టుకుంది చీరకు అంటూ నసుగుతుంది దేవయాని. ఆ తర్వాత రిషి, వసులు మననసులో హ్యాపీగా ఫీలవుతారు. అక్కడ మహింద్ర, జగతిలు కూడా సంతోషంగా ఉంటారు. దేవయాని జగతి, మహింద్రల మాటల్ని బెడ్రూం దగ్గరికి వెళ్లి చాటుగా వింటుంది. వాళ్ల మాటల్ని విని మనసులో కుళ్లుకుంటుంది.
సీన్ కట్ చేస్తే.. రిషి, వసులు కూర్చుని మాట్లాడుకుంటారు. రిషిని చేతు ఇవ్వమని రంగు పోయేందుకు నూనె రాస్తుంది వసు. నీకెందుకు ఇంత శ్రద్ధ? అంటాడు రిషి. ప్రేమ అంటుంది వసు. అపుడే దేవయాని అక్కడికి వెళ్లి.. నాన్నా రిషి అంటుంది. ఆ హోళీ ఏదో ఇక్కడే చేసుకోవాల్సింది కద రిషి అంటుంది. అందరం కలిసి జరుపుకుంటేనే కద పండగ అంటారు అని దేవయాని ఇద్దరి మధ్య మంట పెడుతుంది. దాంతో తప్పు చేశానని గిల్టీగా ఫీలవుతాడు రిషి.
పెద్దమ్మ పెద్ద మనసు చూసి రిషి సంబరపడతాడు. ఇంకోసారి నన్ను దూరం పెట్టకు రిషి అని వేడుకుంటుంది. ఇప్పటినుంచి ప్రతి పండగకు పెద్దమ్మ నా పక్కనే ఉండాలి అని వసుకు చెప్తాడు. దాంతో దేవయాని రిషికి జాగ్రత్తలు చెప్పి వెళ్లిపోతుంది. ఈ తర్వాత రిషిధారలు కూడా కిందికి వెళ్లి భోజనం చేస్తారు. అందరూ కలిసి భోజనం చేస్తుండగా హోళీ గురించి మాట్లాడుకుంటారు. అపుడు మహింద్ర దేవయాని కుళ్లు గురించి ఇన్‌డైరెక్ట్‌గా బయటపెడతాడు. మన మూడు జంటలు కలిసి సెల్ఫీ తీసుకుందామని మహింద్ర అనగా మరి దేవయాని మేడం ఎలా అంటుంది వసు.
ధరణి భర్త పేరు శైలేంద్ర అని చెప్తుంది జగతి. అందరూ శైలేంద్రని ఇంటికి పిలుద్దామని అంటారు కానీ దేవయానికి మాత్రం మంటపెట్టినట్లు అవుతుంది. అందరి మీది కోపం ధరణి మీద తీస్తుంది. ధరణి బాధపడుతూ లోపలికి వెళ్లి కంటతడిపెడుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్‌లో చూద్దాం..
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.