Guntur Kaaram : ఆ కుర్చీని మడతపెట్టి..మహేష్ ఊర మాస్ లుక్స్

Guntur Kaaram : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తున్న మూవీ గుంటూరు కారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రూపుదిద్దుకుంటోన్న ఈ మూవీ లో యంగ్ అండ్ ఎనర్జిటిక్ బ్యూటీ, కుర్రాళ్ల క్రష్ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగువారి పండుగైన సంక్రాంతికి ఈ మూవీ రిలీజ్ కాబోతున్న విషయం తెలిసింది. ఇప్పటికే మూవీ టికెట్లను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సంక్రాంతికి భారీ హిట్ ఎలాగా కొట్టాలన్న కసితో గుంటూరు కారం మూవీ యూనిట్ చేయాల్సిన హంగామా మొత్తం షురూ చేసింది. తాజాగా మేకర్స్ సినిమా నుంచి అదిరిపోయే మాస్ మసాలా సాంగ్ ను విడుదల చేసింది. సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయిన ‘కుర్చీని మడతపెట్టి’ అనే డైలాగ్ లో వచ్చిన ఈ లిరికల్ సాంగ్ నెట్టింట్లో దుమ్ము దులుపుతోంది. ఈ పాటలో మహేష్, శ్రీలీలల ఊర మాస్ స్టెప్స్ చూస్తూ ఎవరికైనా పూనకాలు రావాల్సిందే. మహేష్ అయితే మాస్ స్టెప్స్ ను అవలీలగా వేస్తూ అదరహో అనిపించాడు. న్యూ ఇయర్ వేళ ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

guntur-kaaram-kurchini-madathapetti-lyrical-full-song-released

మహేష్ బాబు చాలా రోజుల గ్యాప్ తర్వాత నటిస్తున్న సినిమా గుంటూరు కారం. ఈ సినిమాపై అభిమానుల్లో ఇప్పటికే ఓ రేంజ్ అంచనాలు ఉన్నాయి. అయితే సినిమా రిలీజ్ తర్వాత మూవీ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో తెలియదు కానీ మూవీ మేకర్స్ చేస్తున్న ప్రమోషన్స్ తో మాత్రం సోషల్ మీడియాలో నిత్యం గుంటూరు మిర్చి హాట్ టాపిక్ గా నిలుస్తోంది. ఒకవైపు సినిమాపై ట్రోల్స్ వస్తున్నప్పటికీ, పాజిటివ్ కామెంట్స్ కూడా భారీగానే వస్తున్నాయి. ఈ మూవీ మాస్ ఆడియోన్స్ ను అలరిస్తుందని ఓవర్గం ఫ్యాన్స్ అయితే చాలా ధీమాతో ఉన్నారు.

guntur-kaaram-kurchini-madathapetti-lyrical-full-song-released

పక్కా మాస్ సినిమా ఇండస్ట్రీలో వచ్చి చాలా రోజులే అవుతోంది. చాలా మంది స్టార్స్ పాన్ ఇండియా సినిమాలతో యాక్షన్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ మన టాలీవుడ్ ప్రిన్స్ మాత్రం మాస్ మంత్రంతో ముందుకెళ్తున్నాడు. డైరెక్టర్ త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబోలో వస్తున్న ఈ మూవీ ఫ్యాన్స్ కి నచ్చేలా తెరకెక్కిస్తున్నారు మేకర్స్. మాస్ ఆడియన్స ఎలాంటి సినిమా చూడాలని అనుకుంటున్నారో అదే తరహాలో దీనిని తీర్చిదిద్దామని ప్రమోషన్స్ లో సినిమా నిర్మాత పదేపదే అనౌన్స్ చేస్తున్నారు. రీసెంట్ గా సినిమా నుంచి రెండు పాటలు విడుదలయ్యాయి. అయితే అవి పెద్దగా జనాలను ఆకట్టుకోలేకపోయాయి. ఇదే క్రమంలో శుక్రవారం గుంటూరు కారం నుంచి కుర్చీ మడతపెట్టి అనే మూడవ పాట ప్రోమోను సోషల్ మీడియాలో వదిలి సినిమాపై అంచనాలు పెంచారు. సోషల్ మీడియాలో బాగా వైరలైన డైలాగ్ తో పాట రావడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. మరోవైపు ఈ పాటపై నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. ఏదిఏమైనప్పటికీ బిగ్ స్క్రీన్ పై మాత్రం ఈ పాట ఇరగదీస్తుందని మూవీ యూనిటి గట్టి నమ్మకంతో ఉంది.

guntur-kaaram-kurchini-madathapetti-lyrical-full-song-released

 

మహేష్ బాబు శ్రీ లీల ఇద్దరు ఈ పాటకు తమ ఎనర్జీని మొత్తం ఉపయోగించారని తెలుస్తోంది. ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లుగా గ్రేస్ మూమెంట్స్ అందించారు. ఈ మాస్ స్టెప్పుటు గట్టిగానే ఇంపాక్ట్ చూపిస్తాయని అర్థమవుతోంది. ఈ సాంగ్ ను ప్రముఖ టాలీవుడ్ కొరయోగ్రాఫర్ శేకర్ మాస్టర్ కంపోజ్ చేశారు. చిత్రీకరిలోనే కొన్ని ఆఫ్ స్క్రీన్ మూమెంట్స్ కూడా ఎడిటర్ హైలెట్ చేశాడు. ఇక రామజోగయ్య శాస్త్రి రాసిన కంపోజ్ చేసిన ఈ పాటను సాహితీ, శ్రీకృష్ణ అద్భుతంగా పాడారు. పాటకు తగ్గట్లుగానే లుక్ లో గ్రేస్ లో మహేష్ శ్రీలీల ఫుట్ మాస్ లుక్ లో కనిపిస్తున్నారు. అదే విధంగా పాట మధ్యలో మహేశ్ ఓ మాస్ డైలాగ్ ఫుల్ యాసలో ఒదిలి ఫ్యాన్స్ ను ఫిదా చేశాడు. సంక్రాంతి బరిలో హాలీవుడ్ సినిమా అవతార్ అయినా మరే సినిమా అయినా సరే పోటీలో నిలబడి గురి కొట్టాలని గుంటూరు కారం గట్టిగా ఫిక్స్ అయ్యింది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్స్ రాబడుతుందో వేచి చూడాల్సిందే.

Sri Aruna Sri

Recent Posts

Pawan Kalyan: ఉస్తాద్ భగత్‌సింగ్ బ్రేకీవెన్ కూడా కష్టమా?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రతీ ఒక్కరిలో ఉండే ఆతృత, ఆసక్తి ఊహించలేనిది. ఎన్ని సినిమాలు బాక్సాఫీస్…

8 hours ago

Kadiri Narasimha Swamy: కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

*బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు *ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక Kadiri Narasimha Swamy: కదిరి, మార్చి…

2 weeks ago

Pawan Kalyan: హైదరాబాద్‌లో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా?

Pawan Kalyan:హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…

3 weeks ago

Ram Charan: ‘పెద్ది’ ప్రమోషన్స్ నెక్స్ట్ లెవల్..క్లారిటీ ఇచ్చిన మేకర్స్ !

Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్‌డేట్స్ రావడం లేదని…

3 weeks ago

Mega 158: మెగా 158లో పవన్ భక్తుడు..అసలు నిజం ఇదే!

Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…

3 weeks ago

Puranapanda Srinivas: హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

Puranapanda Srinivas: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి…

3 weeks ago

This website uses cookies.