Thu. Nov 13th, 2025

    Gangavva: గంగవ్వ సొంతిల్లు కల నెరవేరింది..గృహ ప్రవేశానికి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ వచ్చి సందడి చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో గంగవ్వ సొంతింటికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ‘మై విలేజ్‌ షో’ అనే కార్యక్రమంతో గంగవ్వ యూట్యూబ్‌ స్టార్‌గా అందరికి సుపరిచితురాలు. అలా వచ్చిన పాపులారిటీతోనే బిగ్‌బాస్‌ తెలుగు 4వ సీజన్‌లో పాల్గొనే అవకాశం దక్కించుకుంది. ఈ బిగ్ రియాలిటీ షోతో గంగవ్వ ఇంకా బాగా పాపులారిటీని సొంతం చేసుకుంది. ఈ షోలో ఉన్నప్పుడే నాగార్జునకు తనకు సొంతిల్లు నా కల అనే కోరికను బయటపెట్టింది.

    gangavva-dream house warming ceremony is ready
    gangavva-dream house warming ceremony is ready

    దాంతో ఆమె హౌజ్ నుంచి ఎలిమినేట్ అయిన సమయంలో నాగార్జున ప్రామిస్ చేశారు. బిగ్ బాస్ సీజన్ 4 ద్వారా వచ్చిన డబ్బుకు అదనంగా కొంత డబ్బు ఇస్తానని ..నీ సొంతింటి కల నెరవేస్తునాని చెప్పారు. అన్నట్టుగానే నాగార్జున గంగవ్వకు బిగ్ బాస్‌తో గెలుచుకున్న అమౌంట్‌కు కొంత మొత్తం అందించారు. ఈ డబ్బుతో ఆమె సొంతగా ఇంటి నిర్మాణం మొదలు పెట్టింది. మొత్తానికి ఇటీవలే గంగవ్వ సొంతిల్లు నిర్మాణం పూర్తై గృహ ప్రవేశం జరిగింది. గ్రాండ్‌గానే ఈ కార్యక్రమాన్ని గంగవ్వ నిర్వహించింది.

    Gangavva: త్వరలో నాగార్జునను కలవనున్న గంగవ్వ ..

    గంగవ్వ ఇంటి గృహ ప్రవేశానికి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అఖిల్‌, శివజ్యోతి, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మై విలేజ్‌ షో టీం సభ్యులు సహా పలువురు హాజరయ్యారు. ఆమె బంధువులు, సన్నిహితులు వచ్చి సందడి చేశారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా గంగవ్వ త్వరలో నాగార్జునను కలిసి తన సొంతిల్లు గృహ ప్రవేశం జరిగిన విషయాన్ని చెప్పడంతో పాటు ఆ ఫొటోలను ఆయనకు చూపించి కృతజ్ఞతలు తెలపబోతున్నట్టు తెలుస్తోంది. ఇక గంగవ్వ తన సొంతింటి కల నెరవేరిందని ఓ వీడియోను యూట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేయగా నెటిజన్స్ అందరూ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.