Game Changer:సంక్రాంతి రేస్ నుంచి తప్పుకున్న “విశ్వంభర”. దీనికి కారణం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న “గేమ్ ఛేంజర్”. సౌత్ సినిమా ఇండస్ట్రీకి సంక్రాంతి పండుగ పెద్ద సీజన్. అంతేకాదు, బాలీవుడ్ లోనూ ఎన్నో భారీ చిత్రాలు ఇదే పండుగకి బరిలో దిగుతుంటాయి. ప్రతీ ఏడాది మన తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి బాక్సాఫీస్ వద్ద చిన్న నుంచి పెద్ద హీరోల వరకూ అందరూ పోటీ పడుతుంటారు.
అలాగే, 2025 సంక్రాతికి కూడా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న చిత్రం ముఖ్యంగా బరిలో ఉన్నాయి. అలాగే ప్రభాస్ నటిస్తున్న ‘రాజాసాబ్’ చిత్రాన్ని ఈ పండుగ సీజన్ లోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అంతకంటే ముందే అంటే, ఈ ఏడాది డిసెంబర్ లో అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో రూపొందుతున్న ‘పుష్ప 2’, రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న ‘గేమ్ ఛేంజర్’ చిత్రాలు రావాల్సింది.
Game Changer: మెగాస్టార్ కి కృతజ్ఞతలు..
అయితే, తాజాగా ‘గేమ్ ఛేంజర్’ చిత్ర నిర్మాత దిల్ రాజు పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ చేయాల్సిన సినిమా కాబట్టి 2025 సంక్రాతి అయితే అన్ని విధాలా బావుంటుందనే ఉద్దేశ్యంలో సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఇదే విషయాన్ని మెగాస్టార్ కి అలాగే ఈ మూవీ ప్రొడ్యూసర్స్ వంశీ, ప్రమోద్ లకి తెలిపారు. వారు కూడా సానుకూలంగా స్పందించి తమ ‘విశ్వంభర’ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు మరో డేట్ లాక్ చేసుకుంటామని ‘గేమ్ ఛేంజర్’ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేసుకోమని చెప్పారట.
తాజాగా విషయాన్ని దిల్ రాజు ఓ వీడియో ద్వారా తెలుపుతూ ‘విశ్వంభర’ ని పోస్ట్ పోన్ చేసుకున్నందుకు మెగాస్టార్ కి నిర్మాణ సంస్థ వారికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, దాదాపు మూడేళ్ల నుంచి గేమ్ ఛేంజర్ అత్యంత భారీ హంగులతో తయారవుతోంది. కియారా అద్వానీ, అంజలి, శ్రీకాంత్, జయరాం తదితరులు ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.