Fahadh Faasil : మలయాళం నటుడే అయినా తెలుగువారికి ఫహద్ ఫాజిల్ బాగా పరిచయం. ఆయన నటించిన మలయాళం డబ్బింగ్ సినిమాలు తెలుగు ప్రేక్షకులను బాగా అకట్టుకుంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పుష్ప సినిమా కంటే ముందే ఫహద్ కు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. పుష్ప సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో నటించి ఇక్కడి ఆడియెన్స్ కు మరింత బాగా కనెక్ట్ అయ్యాడు. ఈ మూవీలో ఫాహద్ చేసిన భన్వర్ సింగ్ షెకావత్ క్యారెక్టర్ కి మంచి పేరొచ్చింది. ఇక త్వరలో విడుదల కాబోతున్న పుష్ప 2లోనూ ఈ క్యారెక్టర్ కు మంచి ప్రాధాన్యత ఉన్నట్లు తెలుస్తోంది. ఫహద్ ఈ మధ్యనే మలయాళంలో ఆవేశం అనే సినిమా చేశారు. ఈ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం మలయాళంలో స్టార్ హీరోగా రాణిస్తున్న ఫహద్ తన పర్సనల్ లైఫ్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ను చెప్పారు. ఓ స్కూల్ లాంచింగ్ ఈవెంట్ కు వెళ్లిన ఫహద్ తనకు ఓ రేర్ డిసీజ్ ఉందని చెప్పి అభిమానులకు షాకిచ్చాడు. తాను ADHD వ్యాధి బారిన పడినట్లు తెలిపారు.
ADHD అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్ . 41 ఏళ్ల వయసులో ఈ అరుదైన వ్యాధి బారిన పడినట్లు ఫహద్ తెలిపాడు. మరి ఈ వ్యాధికి ట్రీట్మెంట్ ఉందా అని అడిగితే చిన్నతనంలోనే బయట పడితే నయం చేయవచ్చాని, కానీ తనకు 41 ఏళ్లని తన పరిస్థితిని వివరించాడు. ఇక ఈ వ్యాధి బారిన పడినవారికి ఏ విషయంపైనా ఏకాగ్రత, ధ్యాస ఉండదు. హైపర్ యాక్టివ్, హైపర్ ఫోకస్, ఇంపల్సివిటీ లాంటి లక్షణాలు అధికంగా కనిపిస్తాయి. సైకలాజికల్ గా ఎంతో స్ట్రెస్ లో ఉంటారు. చాలా ఇబ్బంది పడుతుంటారు.
ఫహద్ ఫాజిల్ మాత్రమే కాదు గతంలో హాలీవుడ్, బాలీవుడ్ కు చెందిన కొంత మంది సినీసెలబ్రిటీలు ADHD బారిన పడ్డారు. విల్ స్మిత్, ర్యాన్ గోస్లిన్, జస్టిన్ టింబర్ లేక్, జిమ్ క్యారీ, సుశాంత్ సింగ్ రాజ్ పుత్, ఎమ్మా వాట్సన్ వంటి వారు ఈ డిసీజ్ తో బాధపడ్డారు. బ్రేక్ లేకుండా సినిమా షూటింగులు, టూర్స్ తో బిజీగా ఉండే హీరో, మీరోయిన్లలో ఇలాంటి రుగ్మతల బారిన పడుతుంటారట. స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడం, మానసికంగా ప్రశాంతంగా ఉండడం, హెల్దీ లైఫ్ స్టైల్ ను అలవాటు చేసుకోవడం వల్ల ఈ రుగ్మతలను అధిగమించవచ్చు.