Banana: అరటిపండు కాలాలకు అనుగుణంగా ఏ కాలంలో అయినా మనకు విరివిగా లభిస్తూ ఉంటుంది. ఇలా అరటిపండు అన్ని కాలాలలో ఎంతో పుష్కలంగా లభిస్తుంది కనుక అరటిపండు తినడానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. ఇక అరటి పండ్లు ఎన్నో రకాల పోషకాలు విటమిన్స్ మినరల్స్ ఫైబర్ దాగి ఉంది కనుక అరటి పనులు తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను మనం పొందవచ్చు. అలాగే అరటిపండు మన జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి మలబద్దక సమస్యను తొలగించి తీసుకున్న ఆహారాలు తేలికగా జీర్ణం అవ్వడానికి దోహదపడుతుంది.
ఇలా అరటి పండులో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కనుక చాలా మంది తినడానికి ఇష్టపడతారు. అయితే అరటి పండును ఉదయం తింటే మంచిదా లేకపోతే ఎప్పుడైనా తినొచ్చు అన్న సందేహాలు చాలామందికి ఉంటాయి కొంతమంది ఉదయం సాయంత్రం మధ్యాహ్నం ఇలా వారికి ఎప్పుడు అరటిపండు కనిపించిన తింటూ ఉంటారు. ఇలా తినడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అరటిపండును వీలైనంతవరకు ఉదయం పరగడుపున రెండు గ్లాసుల నీళ్లు తాగిన తర్వాత తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు అప్పుడే అందులో ఉన్నటువంటి పోషకాలు విటమిన్లు మన శరీరానికి సులభంగా అందుతాయి.
ఇక రాత్రి సమయంలో కూడా అరటిపండు తిని పడుకోవడం వల్ల తేలికగా ఆహారం జీర్ణం అవుతుందని భావిస్తారు కానీ ఎవరైతే దగ్గు ఆస్తమా వట్టి సమస్యలతో బాధపడుతుంటారో అలాంటి వారు మాత్రం పొరపాటున కూడా సాయంత్రం అరటిపండు తినకూడదు ఇలా అరటి పండు తినడం వల్ల శ్లేష్మం ఏర్పడి మరింత శ్వాస కోస సమస్య ఏర్పడే అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా రాత్రిపూట అరటి పండు తినటం వల్ల ఉబకాయం సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక రాత్రి పూట వీలైనంతవరకు అరటిపండు తినకపోవడమే మంచిది ఉదయం తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.