Egg Boiling Tips: ప్రతిరోజు ఒక గుడ్డు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు మనకి అందుతాయనే విషయం తెలిసిందే. గుడ్డులో ఎన్నో పోషకాలు ఉంటాయి అనే సంగతి తెలిసిందే. గుడ్డును ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఎన్నో రకాల పోషకాలు మన శరీరానికి అందుతాయి. అందుకే ప్రతిరోజు ఆహారంలో భాగంగా ఒక ఉడకబెట్టిన కోడి గుడ్డును తీసుకోవడం ఎంతో మంచిది. అయితే కొన్నిసార్లు మనం గుడ్లను ఉడుకు పెట్టే సమయంలో అవి పగిలిపోతూ ఉంటాయి. ఇలా పగిలిపోకుండా ఉండాలంటే ఈ సింపుల్ చిట్కాలను పాటిస్తే చాలు..
కొన్నిసార్లు మనం గుడ్లను ఉడకపెట్టేటప్పుడు పగిలిపోయి తెల్ల సొన మొత్తం బయటకు వస్తుంది. ఇలా రావడం వల్ల గుడ్లు తినడానికి చాలామంది ఇష్టపడరు. అయితే ఉడకబెట్టే సమయంలో గుడ్లు పగిలిపోకుండా ఉండాలి అంటే గుడ్లను ఉడకపెట్టే సమయంలో ఆ నీటిలోకి కాస్త ఉప్పు లేదా వెనిగర్ వేయడం వల్ల గుడ్లు పగిలిపోవు. అయితే చాలామంది ఐదు నిమిషాల పాటు గుడ్లను ఉడకపెట్టి స్టవ్ ఆఫ్ చేస్తుంటారు. ఇలా చేయటం వల్ల గుడ్లు ఉడకవు సుమారు 15 నిమిషాల పాటు గుడ్లను ఉడక పెట్టాల్సి ఉంటుంది.
Egg Boiling Tips
ఇక చాలా మంది గుడ్లను ఫ్రిజ్ నిల్వ చేస్తూ ఉంటారు. ఇలా నిల్వ చేసిన గుడ్లను బయటకు తీసి వెంటనే ఉడకపెట్టిన కూడా గుడ్లు పగిలిపోతాయి. అలా కాకుండా గుడ్లను ఉడకబెట్టే ముందు బయటకు తీసి గది ఉష్ణోగ్రతకు వచ్చేవరకు బయట పెట్టి అనంతరం ఉడకబెట్టాలి ఇలా చేయడం వల్ల కూడా గుడ్లు పగిలిపోకుండా ఉంటాయి. ఈ సింపుల్ చిట్కాలను పాటించి గుడ్లను ఉడకబెట్టడంతో గుడ్లు పగిలిపోకుండా మంచిగా ఉడుకుతాయి.