Banana: అరటి పండు ప్రతి ఒక్క సీజన్లో లభించే పండు. అందుకే అరటిపండును ప్రదీప్ సీజన్లోనూ మనకు అందుబాటులో ఉంటుంది కాబట్టి చాలామంది తినడానికి చూపుతూ ఉంటారు అంతేకాకుండా అరటిపండు ప్రతి ఒక్క శుభకార్యంలోనూ కీలకంగా మారుతుందని చెప్పాలి. ఈ విధంగా అరటిపండు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి అనే సంగతి కూడా మనకు తెలిసిందే.
ఇకపోతే ఆరోగ్య ప్రయోజనాలు అధికంగా ఉన్నాయి కదా అని అరటిపండును వివిధ రకాల ఆహార పదార్థాలతో పాటు కలిపి తినడం వల్ల పెద్ద ఎత్తున ప్రమాదంలో పడతామని నిపుణులు చెబుతున్నారు పొరపాటున కూడా కొన్ని ఆహార పదార్థాలతో కలిపి అరటిపండును తినకూడదని నిపుణులు చెబుతున్నారు మరి అరటిపండును ఏ ఏ పదార్థాలతో కలిపి తినకూడదు అనే విషయానికి వస్తే..
నిమ్మ, నారింజ, ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లతో అరటి పండ్లు తినకూడదు సిట్రస్ పండ్లతో అరటి పండ్లు కలిపి తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదేవిధంగా పాలు అరటిపండును కూడా కలిపి తీసుకోకూడదు.ఇవి రెండు కలిపి తీసుకుంటే శరీరంలో గందరగోళాన్ని సృష్టిస్తాయి. జీర్ణ సమస్యలకు దారి తీస్తాయి. జలుబు, దగ్గు మరియు ఇతర అనారోగ్య సమస్యలను కూడా తెచ్చిపెట్టాయి.మాంసం, గుడ్లు వంటి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ మరియు అరటి పండు కలిపి లేదా ఒకేసారి తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే, అధిక ప్రోటీన్ ఆహారాలతో అరటిపండు తీసుకుంటే గ్యాస్ సమస్య తలెత్తుతుంది. అందుకే అరటి పండును ఈ పదార్ధాలతో కలిపి అసలు తినకూడదు.