Health care: నేరేడు పండ్లు వర్షాకాలంలో మాత్రమే ఎంతో విరివిగా లభించే ఈ పండ్లను తినడానికి ప్రతి ఒక్కరు ఇష్టపడుతూ ఉంటారు. ఇలా సీజనల్ ఫ్రూట్స్ కావడంతో ఆయా కాలంలో దొరికే వాటిని తప్పనిసరిగా తినాలని కూడా వైద్యులు సూచిస్తూ ఉంటారు. ఇక నేరేడు పండ్లలో పోషకాలు ఎంతో సమృద్ధిగా ఉంటాయనే విషయం మనకు తెలిసిందే. నేరేడు పండ్లలో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి దోహదపడుతుంది..
ఈ పండ్లలో థయామిన్, రైబోఫ్లేవిన్, నియాసిన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, కాల్షియం, కొవ్వు, ప్రోటీన్, కార్బోహైడ్రేట్, బి విటమిన్లు మరియు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి, ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి, ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది బరువు తగ్గించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఇలా ఎంతో ఆరోగ్యకరమైనటువంటి ఈ పండ్లను తినడం వల్ల ఈ ప్రయోజనాలన్నిటిని మనం పొందవచ్చు.
ఇక ఈ పండ్లను తిన్న తర్వాత పొరపాటున కూడా కొన్ని పదార్థాలను అసలు తీసుకోకూడదు. అవి తీసుకోవడం వల్ల మనం ఇతర సమస్యలతో బాధపడాల్సి ఉంటుంది. మరి నేరేడు పండ్లు తిన్న తర్వాత ఎలాంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి అనే విషయానికి వస్తే.. నేరేడు పండ్లు తిన్న తర్వాత పాలు తాగకూడదు. ఒక గంటపాటు పాలు తాగకుండా ఉండటం మంచిది. పాలు తాగటం వల్ల నొప్పి, గ్యాస్ మరియు మలబద్ధకం సంభవించవచ్చు.
ఇక నేరేడు పండును తిన్న తర్వాత పసుపును కూడా తీసుకోకూడదు పసుపు తీసుకోవడం వల్ల కడుపులో మంటగా ఉంటుంది అదేవిధంగా ఊరగాయలను కూడా తినకూడదు.