Donkey milk: ఒకప్పుడు మన పెద్దవారు గాడిద పాలు తాగుతూ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేవారు.ఇటీవలే కాలంలో గాడిదలు అంతరించిపోయే దశలో ఉన్నాయి. గాడిద పాలలో ఉన్నటువంటి ఆరోగ్య ప్రయోజనాలు తెలిసినటువంటి కొందరు గాడిదలను అంతరించిపోకుండా వాటిని పెంచుతున్నారు. అలాగే లక్షలు జీతాలు వచ్చే ఉద్యోగాలను వదిలి గాడిదల పెంపకం చేపట్టారు. ఉద్యోగాలు మాని గాడిదలను పెంచడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా..గాడిద పాలకు అంత డిమాండ్ ఉండటం వల్లే ఉద్యోగాలు కూడా మానీ గాడిదలని పెంచుతూ లక్షలకు లక్షలు సంపాదిస్తున్నారు. గాడిద పాలలోతల్లిపాలతో సమానమైన పోషకాలు, ఔషధ గుణాలు ఉన్నాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.
పూర్వపు రోజుల్లో పల్లెల్లో చిన్నపిల్లలకు గాడిద పాలను తాగించడం మనందరికీ తెలిసే ఉంటుంది. దానికి కారణం గాడిద పాలల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే ఔషధ గుణాలు ఉండడమే ఈ విషయాన్ని మన పూర్వీకులు ఆనాడే గుర్తించారు. ఆధునిక పోకడలకు పోయి మనం ఈ విషయాన్ని మర్చిపోయాం అంతే. ఆవు పాలతో పోల్చినప్పుడు గాడిద పాలల్లో తక్కువ కొవ్వు, ఎక్కువ ఖనిజలవనాలు, లాప్టోస్, ప్రోటీన్స్ ఉన్నాయని తెలుస్తోంది. అందుకే గాడిద పాలకు అంత గిరాకీ.
గాడిద పాలులో విటమిన్స్, మినిరల్స్ సమృద్ధిగా లభించడంతోపాటు పాలీఅన్ శాచ్యురేటెడ్, ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి కావున గుండె, ఎముకలు ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే చర్మ ఆరోగ్యాన్ని పెంపొందించి చర్మంపై వచ్చే అలర్జీలు ఇన్ఫెక్షన్లను తగ్గించడంతోపాటు వృద్ధాప్య ఛాయాలను తగ్గించడంలో సహాయపడతాయి. తరచూ గాడిద పాలన తీసుకోవడం వల్ల రక్తపోటు, షుగర్ వ్యాధి వంటి వాటి నుంచి కూడా బయటపడవచ్చు. ఈ గాడిద పాలు కేవలం ఆరోగ్య ప్రయోజనాలను మాత్రమే కాకుండా చర్మ సౌందర్యాన్ని పెంపొందించడంలో కూడా ఎంతగానో దోహదపడతాయి. అందుకే మార్కెట్లో లీటర్ గాడిద పాలు ధర వేలల్లో ధర పలుకుతుంది.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.