Sobhita Dhulipala : శోభిత ధూళిపాళ్ళ కుర్ర హీరోయిన్ అయినా తన అఫైర్ రూమర్స్ తో అందరి దృష్టిలో పడింది. కెరీర్ లో ఆచి తూచి అడుగులు వేస్తోంది. వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తూనే ఉంది. నటి మణిరత్నం PS 2, ది నైట్ మేనేజర్ 2 వంటి ప్రాజెక్ట్స్ లో తన అద్భుతమైన ప్రదర్శనతో అందరి హృదయాలను దొంగిలించింది. ఓ వైపు సినిమాలు, వెబ్ సిరీస్ తో బిజీగా ఉంటూనే మరోవైపు హాట్ ఫోటో షూట్ లతో నెట్టింట్లో హీట్ పెంచుతోంది.
శోభితా ధూళిపాళ్ళ ఒక సంపూర్ణ ఫ్యాషన్‌వాది. ఈ నటి తన సార్టోరియల్ సెన్స్ ఆఫ్ ఫ్యాషన్‌కు ప్రసిద్ది చెందింది, ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో తన ఫ్యాషన్ డైరీల నుండి స్నిప్పెట్‌లను వీలు చిక్కినప్పుడల్లా అందిస్తూ ఉంటుంది. క్యాజువల్ లుక్స్ నుండి ఫెస్టివ్ అవుట్ ఫిట్స్ వరకు, శోభిత ఫ్యాషన్ డైరీలు వైవిధ్యంగా ఉంటాయి. ఆమె ఇన్ స్టాలో ఫ్యాషన్ ఇన్‌స్పోలు అనేకం ఉన్నాయి. తాజాగా ఈ బ్యూటీ ట్రెడిషనల్ రూపంతో నెట్టింట్లో మంటలు రేపింది.
శోభిత తాజా ఫోటోషూట్ కోసం చీరను ఎన్నుకుంది. తన మేజర్ ఫ్యాషన్ ఇన్‌స్పోను అందిస్తూ ఆమె అభిమానులను ఉర్రూతలూగించింది. ఈ హాట్ శారీలో సొగసులు అరబోసింది. కైపెక్కించే లుక్స్ తో అందరిని కట్టి పడేసింది.
పోస్ట్‌లో, శోభిత ఫ్యాషన్ డిజైనర్ తరుణ్ తహిలియాని డిజైన్ చేసిన అద్భుతమైన చీరను కట్టుకుని కనిపించింది. ఈ చీర ధర అక్షరాల ₹ 4.59 లక్షలు అవును మీరు విన్నది నిజమే.
టిష్యూ జార్జెట్ ఫాబ్రిక్ ఓంబ్రే షేడ్‌లో వచ్చిన చీరకు చికంకరి జలీ షాడోతో ఎంబ్రాయిడరీ , మరోరీ వర్క్‌ను జోడించారు డిజైనర్. ఆమె చీరను సన్నటి స్లీవ్‌లతో డీప్ నెక్ లైన్ తో వచ్చిన మ్యాచింగ్ బ్లౌజ్‌తో జత చేసింది. బ్లౌజ్ వెనుక భాగంలో అలంకరించబడిన క్రిస్టల్ వివరాలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి.
సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ శ్రద్ధా మిశ్రా సహాయంతో, శోభిత బ్రౌన్ ఐషాడో, మాస్కరా పూసిన కనురెప్పలు, కాంటౌర్డ్ బుగ్గలు న్యూడ్ లిప్‌స్టిక్ తో తనను తాను అలంకరించుకుంది. ఆమె ఒక జత ఆకుపచ్చ పచ్చ స్టేట్‌మెంట్ చెవిపోగులతో తన రూపాన్ని యాక్సెసరైజ్ చేసింది. శోభిత తన గ్లామ్ రూపాన్ని పూర్తి చేసింది.
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…
Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…
This website uses cookies.