Shell At Home: మన హిందూ సంప్రదాయాల ప్రకారం ఎన్నో రకాల వస్తువులను మనం పూజిస్తూ ఉంటాము ఈ క్రమంలోనే చాలామంది శంఖోని కూడా పూజలు ఉపయోగిస్తూ ఉంటారు శంఖం ఇంట్లో పెట్టుకుని పూజించడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని భావిస్తారు. శంఖం సాగర మదనం చేసే సమయంలో లక్ష్మీదేవితో పాటు ఉద్భవించడంతో సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగానే భావిస్తూ ఉంటారు అయితే శంకంలో వివిధ రకాలు ఉంటాయి మరి ఏ ఇంట్లో ఎలాంటి శంఖం పెట్టుకొని పూజించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయానికి వస్తే…
అచ్చం ఆవు నోటిని పోలి ఉన్నటువంటి శంఖాన్ని కామధేను శంఖం అంటారు. ఈ శంఖాన్ని పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మన పైనే ఉండి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పండితులు చెబుతున్నారు ఇంట్లో ఈ కామధేను శంఖాన్ని పెట్టుకుని పూజించడం ఎంతో మంచిది. గణేశ శంఖం.. వినాయకుని పూజలో గణపతి శంఖాన్ని ఉంచడం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఈ శంఖాన్ని పూజించడం వల్ల ఏ విధమైనటువంటి అడ్డంకులు ఉండవు.
ముత్యాల శంఖాన్ని ఇంట్లో పూజిస్తే కుటుంబ సభ్యులకు మంచి జరుగుతుంది. ఈ శంఖాన్ని ఇంట్లో ఉంచుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. దేవుడి గదిలో తెల్లటి వస్త్రం పై ఉంచి పూజించడం మంచిది. ఐరావత శంకర్ ని ఇంట్లో పూజించడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయి ఇక ఈ శంఖం ఇంటి ప్రధాన ద్వారం వద్ద పెట్టడం వల్ల ఇంట్లోకి ఎట్లాంటి పరిస్థితులలోను నెగిటివ్ ఎనర్జీ ఏర్పడదని మొత్తం అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయని పండితులు చెబుతున్నారు.