Wed. Feb 11th, 2026

    Director Krish: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘హరి హర వీరమల్లు’ ఇటీవల విడుదలై మంచి స్పందన అందుకుంటోంది. విడుదలైన తొలి రోజే ఓవర్సీస్ మార్కెట్‌లో మిలియన్ డాలర్ క్లబ్‌లోకి చేరడంతో పాటు, వసూళ్లు కూడా ఊహించని రీతిలో పెరుగుతున్నాయి. జులై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం మంచి వసూళ్లతో నిర్మాతలు ఖుషీ అవుతున్నారు.

    అయితే ఈ సినిమా ప్రారంభ దశలో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. మధ్యలో కొన్ని కారణాల వల్ల ఆయన ప్రాజెక్టు నుండి తప్పుకోవడంతో, దర్శక బాధ్యతలు జ్యోతికృష్ణ స్వీకరించారు. ఈ విషయంపై కొంతకాలంగా పలు అనుమానాలు, చర్చలు జరుగుతున్న నేపథ్యంలో తాజాగా క్రిష్ ఓ మీడియా ఇంటర్వ్యూలో స్పందించినట్లు తెలుస్తోంది.

    తనకు పవన్ కల్యాణ్‌తో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టంగా తెలిపారు. “నాకు, పవన్‌కు మధ్య క్రియేటివ్ డిఫరెన్స్‌లు కూడా లేవు. నేను ఓపెన్ మైండెడ్‌ను. భవిష్యత్తులో పవన్‌ కల్యాణ్‌తో కలిసి మరో సినిమా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను” అని క్రిష్ పేర్కొన్నారు. త్వరలో ఈ మార్పుల వెనుక ఉన్న అసలు కారణాలు బయటపడతాయని కూడా ఆయన చెప్పినట్లు సమాచారం.

    director-krish-differences-with-pawan-thats-why-he-left-veeramallu
    director-krish-differences-with-pawan-thats-why-he-left-veeramallu

    Director Krish: సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.

    ఇక సినిమా రిలీజ్‌కు ముందు కూడా పవన్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తూ క్రిష్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. సినిమాను పూర్తి చేయడంలో పవన్ కల్యాణ్‌, నిర్మాత ఏఎం రత్నం గారు ఎంతో కృషి పెట్టారని, సినిమా జర్నీలో వారి పాత్ర అమూల్యమని చెప్పుకొచ్చారు.

    ప్రస్తుతం ‘హరి హర వీరమల్లు’ కలెక్షన్ల పరంగా మంచి జోరుతో సాగుతోంది. ఓవర్సీస్ మార్కెట్‌లో తొలి రోజే ఒక మిలియన్ డాలర్ వసూలు చేయడం సినిమా స్థాయిని, పవన్ బ్రాండ్ పవర్‌ను మరోసారి రుజువుచేస్తోంది. వీకెండ్ కలెక్షన్లతో మరింత బోనీ అవుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.