Fri. Nov 14th, 2025

    Samantha: చాలా రోజుల తర్వాత సినీ నటి సమంత తన ఆహారపు అలవాట్లను అభిమానులతో పంచుకుంది. ఒకప్పుడు హార్డ్‌కోర్ నాన్ వెజిటేరియన్ అయిన ఆమె, ముఖ్యంగా చేపలంటే ప్రాణం. సాల్మన్ ఫిష్ అయితే మరీ ఇష్టమైన వంటకం. తన స్నేహితుడు వెన్నెల కిషోర్‌తో కలిసినప్పుడల్లా ఆహారమే ప్రధాన చర్చా అంశం అవుతూ ఉండేది.

    అయితే ఇవన్నీ మయోసైటిస్ అనే అనారోగ్య పరిస్థితికి ముందు. ఆ వ్యాధి తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని చెప్పొచ్చు. ఆరోగ్య సమస్యలు తలెత్తిన తర్వాత సమంత తన డైట్‌ను పూర్తిగా మార్చుకుంది. ఇప్పుడు ఆమె శాకాహారాన్ని ప్రాధాన్యంగా తీసుకుంటోంది.

    ప్రస్తుతం రోజుకు మూడు పూటలు తింటానని చెబుతున్న సమంత, బ్రేక్‌ఫాస్ట్ విషయంలో చాలా సింపుల్‌గా ఉంటుంది. ఎక్కువగా స్మూతీలు తాగే అలవాటు. లంచ్‌లో ఆకుకూరలు, కాయగూరలు తప్పనిసరిగా ఉంటాయి. ప్రత్యేకంగా కాలీఫ్లవర్, మొలకెత్తిన గింజలు, బ్రకోలీ వంటివి ఆమె బాగా ఇష్టపడుతుంది. అయితే అన్ని ఆకుకూరలు తినదు. పాలకూర మాత్రం పూర్తిగా తలనొప్పిగా భావించి దానిని డైట్ నుంచి తొలగించింది.

    samantha-that-changed-my-life
    samantha-that-changed-my-life

    Samantha: మారిన ఆహారపు అలవాట్లు

    ఆమె వంటల్లో పసుపు తప్పనిసరిగా ఉండాలని చూసుకుంటుంది. అంతేకాదు, ఆవు నెయ్యి మాత్రమే వాడుతుందని చెబుతోంది. ఇవే తనకు ఆరోగ్యంగా ఉండేందుకు కారణమని చెబుతోంది సమంత.తన డైట్‌లో “చీట్ మీల్”కు మాత్రం పూర్తి వ్యతిరేకం. వారం రోజులపాటు డైట్ పాటించి, ఒక రోజు ఎర్రటి మసాలా తినడమే చీట్ మీల్ కాన్సెప్ట్. కానీ సమంత మాత్రం ప్రతి రోజు ఒకే రకమైన డైట్‌ను పాటిస్తానంటోంది.

    ఇక షూటింగ్స్ కోసం బయటకి వెళ్లినప్పుడు ఎలా అని అడిగితే, సమంత దగ్గర అది కూడా ఓ సింపుల్ పరిష్కారమే. ఆమె అసిస్టెంట్ ఆ సమయంలో షెఫ్ అవతారం ఎత్తుతాడట. సమంత రెగ్యులర్‌గా తినే ఫుడ్‌ను వండటంలో ఎక్స్‌పర్ట్ అయిపోయాడట. ఆమెకు అనుకూలంగా, ఆరోగ్యకరంగా ఉండేలా ఆహారం సిద్ధం చేస్తాడని చెబుతోంది సమంత. సమంత మారిన ఆహారపు అలవాట్లు ఇప్పుడు ఆమె ఆరోగ్యం, ఫిట్‌నెస్‌కు బలమైన పునాది అయ్యాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.