Director Atlee : దర్శకుడు అట్లీ తండ్రయ్యాడు. తన మొదటి సంతానం కావడంతో ఈ సంతోషాన్ని ఒక వేడుకలా జరుపుకునేందుకు అతని భార్య ఇన్‌స్టాగ్రామ్‌లో సంతోషకరమైన వార్తను పంచుకున్నాడు అట్లీ . తమ హ్యాపీనోస్ ను ఫోటో ద్వారా తెలియజేసేందుకు ఈ కపుల్ ఓ క్యూట్ పిక్‌ను ఇన్‌స్టాలో పోస్ట్ చేసి ఫ్యాన్స్‌ను ఖుషీ చేశారు. ఈ ఫోటోలో కొత్త తల్లిదండ్రులు తమ చేతుల్లో ఒక జత చిట్టి షూలను పట్టుకున్నట్లు చూడవచ్చు. ఈ ప్రపంచంలోకి ఒక చిన్న పిల్లవాడిని స్వాగతించినందుకు థాంక్యూ…అని అంటూనే భావోద్వేగమైన పోస్ట్ చేసింది అట్లీ భార్య ప్రియ. మీరు చెప్పింది నిజమే. ప్రపంచంలో ఇలాంటి అనుభూతి మరొకటి లేదు. మా కొడుకు ఇక్కడ ఉన్నాడు! ఉత్తేజకరమైన కొత్త పేరెంటింగ్ అడ్వెంచర్ ను ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నాము చాలా సంతోషంగా ఉంది అంటూ పిక్ కింద తన మదిలోని మాటలను రాసుకొచ్చింది ప్రియా.
జనవరి 31, 2023న ఈ ప్రియా తన మొదటి బిడ్డకు జన్మనిచ్చింది. ‘ఇట్స్ ఎ బాయ్’ అనే స్టిక్కర్‌తో ప్రియా భర్త అట్లీ, బేబీ షూస్ మోస్తున్న ఫోటోను ప్రియా ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసింది. డిసెంబర్ 2022లో, ఈ జంట పెళ్లైంది. పెళ్లైన 8 సంవత్సరాల తర్వాత బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు అంతకు ముందు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించి అభిమానులను ఆశ్చర్యపరిచారు.
ఈ జంట ఎప్పుడూ ఉత్తేజకరమైన పోస్ట్‌లను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తుంటుంది. అట్లీ, ప్రియ దంపతులకు కొడుకు పుట్టడం వారి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. నటి కాజల్ అగర్వాల్ ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ, బిగ్ అభినందనలు అని తెలుపుతూ మీ ముగ్గురినీ కలవడానికి వేచి ఉండలేను అని కామెంట్ చేసింది. కీర్తి సురేష్ కూడా కొత్త అమ్మ నాన్నలకు పెద్ద అభినందనలు అని కామెంట్ చేసింది.
అట్లీ ఒక తమిళ డైరెక్టర్, దక్షిణాదిలో అత్యంత విజయవంతమైన దర్శకుడిగా క్రేజ్ ను సంపాదించుకున్నాడు. 2019లో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రం బిగిల్ ను తెరకెక్కించింది అట్లీనే. ఈ స్థాయికి చేరుకోవడానికి అట్లీ అనేక ఇబ్బందులను, అడ్డంకులను అధిగమించాడు. తాజాగా అట్లీ మొదటిసారి బాలీవుడ్‌లో అతిభారీ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. జవాన్ సినిమాతో కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ను డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమాలో సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటించబోతోంది. వివిధ మీడియా నివేదికల ప్రకారం, నయనతార లేడీ ఇన్వెస్టిగేటర్ పాత్రను పోషిస్తుండగా, షారుఖ్ ఖాన్ డ్యుయల్ రోల్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది.
ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…
Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…
Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…
Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…
Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…
This website uses cookies.