Categories: NewsPolitics

Pawan Kalyan: ట్వీట్ లతో భయపెడుతున్న జనసేనాని

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో రాబోయే ఎన్నికలే లక్ష్యంగా తన రాజకీయ వ్యూహాలతో వైసీపీని గద్దె దించడానికి గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడా కూడా తగ్గకుండా ఓ వైపు సోషల్ మీడియాని, మరో వైపు పబ్లిక్ మీటింగ్స్ ద్వారా వైసీపీకి చెమటలు పట్టిస్తున్నాడు అనే మాట వినిపిస్తుంది. ముఖ్యంగా వైసీపీ వైఫల్యాలని, ఆ నాయకుల విధానాలని బలంగా ప్రజలలోకి తీసుకొని వెళ్తున్నారు.

తాను సిద్ధాంతపరంగా ప్రభుత్వ చేస్తున్న పనులపై విమర్శలు చేస్తే తనపై వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారని ప్రజలకి గట్టిగానే నమ్మిస్తున్నారు. ఇప్పటికే వైసీపీ పవన్ కళ్యాణ్ పై చేస్తున్న వ్యక్తిగత దాడి ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. పవన్ కళ్యాణ్ ని విమర్శించడానికి ఎంత సేపు దత్తపుత్రుడు, ముగ్గురు పెళ్ళాలు అనే మాటలు తప్ప వైసీపీ నాయకుల దగ్గర మరింకేమీ ఉండటం లేదా అనే ప్రశ్న ప్రజల నుంచి వస్తున్నాయి.

ఇక వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పడంతో పాటు టీడీపీతో పొత్తు సమీకరణాలకి తెరతీసిన పవన్ కళ్యాణ్ వైసీపీకి టెన్షన్ పెట్టాడు. జనసేనానిని ఎలా అయినా టీడీపీతో కలవకుండా ఆపాలనే వైసీపీ ప్రయత్నం బెడిసికొట్టడంతో ఇప్పుడు ఇద్దరూ కలిసి వచ్చిన ఎదుర్కోవడానికి జగన్ తన టీమ్ ని సిద్ధం చేస్తున్నారు. ఇక జగన్ కూడా బయటకి వచ్చి సభలలో పాల్గొన్నప్పుడు తాను సింహంలా సింగిల్ గా వస్తూ ఉన్నా అని వారంతా గుంటనక్కల మాదిరిగా తన మీద దాడి చేస్తున్నారని  విమర్శలు చేశారు. అలాగే ఎప్పటిమాదిరిగా దత్తపుత్రుడు అంటూ అదే పల్లవి పాడారు. అలాగే పవన్ కళ్యాణ్ గత మీటింగ్ లో మాట్లాడుతూ ఏపీలో క్యాస్ట్ వార్ నడుస్తుందని అన్నారు.

వైసీపీ కులాలని విభజించి రాజకీయం నడుపుతుందని విమర్శించారు. అయితే దీనికి కౌంటర్ గా జగన్ ఏపీలో జరుగుతుంది క్యాస్ట్ వార్ కాదని క్లాస్ వార్ అని పేర్కొన్నాడు. అయితే దీనిపై పవన్ కళ్యాణ్ వరుస ట్వీట్ లతో కౌంటర్ ఇచ్చారు. దేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రంలో పేదవాళ్ళు ఎక్కువగా ఉన్నారని అన్నారు. అలాగే ధనిక ముఖ్యమంత్రి పాలనలో తాను తప్ప అందరూ బానిసలే అని భావన వైసీపీలో ఉందని విమర్శించారు.

క్లాస్ వార్ కి జగన్ కొత్త నిర్వచనం చెప్పారని, ఓ వైపు పేదలపై పడి అన్ని విధాలుగా దోచుకుంటూ తాను పేదవాడిని అని చెప్పుకుంటూ ప్రజలని నమ్మించాలని అనుకుంటున్నారు అంటూ విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ట్వీట్ లపై వైసీపీ మళ్ళీ భుజాలు తడుముకుంటూ పవన్ ముగ్గురు పెళ్ళాలు అంటూ మంత్రి అమర్ నాథ్ విమర్శలు చేయడం ఆసక్తికరంగా మారింది.

Varalakshmi

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

3 days ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

3 days ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

3 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

3 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

3 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

4 weeks ago

This website uses cookies.