Michael Jackson – Prabhu Deva : ఇండియన్ మైఖేల్ జాక్సన్‌గా సిల్వర్ స్క్రీన్ మీద అలరిస్తున్న కొరియోగ్రాఫర్, డైరెక్టర్ ప్రభుదేవాల గురించి ఓ లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆయన ఓ సూపర్ పాప్ సింగర్ కమ్ డాన్సర్ మైఖేల్ జాక్సన్ బయోపిక్‌లో నటించబోతున్నారని. ఇది నిజమేనంటూ ఇప్పుడు అంతటా ప్రచారం జరుగుతోంది. ఈ వార్త గురించే ఎప్పటినుంచో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మైఖేల్ జాక్సన్, ప్రభుదేవా అభిమానులు ఎదురుచూస్తున్నారు.
మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందో..ఎప్పుడు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీదకి రాబోతుందో తెలియాలంటే అసలు మ్యాటర్‌లోకి వెళ్ళాల్సిందే.
మైఖేల్ జాక్సన్ మరణించిన తర్వాత కూడా ఆయనను, ఆయన పాప్ సాంగ్స్‌ను ఈ ప్రపంచం మరిచిపోలేదు. బ్రేక్ డాన్స్ అభిమానులు ఎంజాయ్ చేస్తున్నంతకాలం మైఖేల్ జాక్సన్ బ్రతికే ఉంటాడని అందరూ మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు, పాప్ సంగీతం వినిపించేంత వరకు మైఖేల్ జాక్సన్ పాడిన పాటలు ఈ ప్రపంచంలో ఎన్నో చోట్ల వినిపిస్తూనే ఉంటాయని పలు సందర్భాలు రుజువు చేస్తున్నాయి.
Michael Jackson – Prabhu Deva : ప్రభుదేవా అయితేనే ఆ పాత్రకి న్యాయం చేయగలడు.
ఇక ఇప్పటికీ మైఖేల్ జాక్సన్ మృతి పెద్ద మిస్టరీగానే ఉంది. యాభై (50) ఏళ్ళ వయస్సులో మైఖేల్ అనారోగ్యంతో చనిపోయాడు. కానీ, ఇది చాలామంది నమ్మడం లేదు. మైఖేల్ మీద విషప్రయోగం జరిగిందని వాదిస్తున్నారు. ఇక ఆయన పాప్ రారాజుగా ఎదిగే క్రమంలో నల్ల జాతికి చెందిన వాడని ఎన్నో రకాలుగా అవమానించారు. వాటన్నిటినీ తట్టుకొని చాలాసార్లు సర్జరీలు చేయించుకొని తెల్లజాతీయుడిగా మారాడు.
అయితే, ఇప్పుడు హాలీవుడ్‌లో మైఖేల్ జాక్సన్ బయోపిక్ రూపొందనుంది. దీనికి మేకర్స్ రంగం సిద్దం చేస్తున్నారు. ఈ సినిమాకి అంటోనియో ఫుకో దర్శకత్వం వహించబోతున్నాడు. 3 సార్లు ఆస్కార్ విన్నర్‌గా నిలిచిన జాన్ లోగన్ కథ అందిస్తున్నారు. ఇక మైఖేల్ జాక్సన్ పాత్రలో ఆయన తమ్ముడు కొడుకు, పాప్ సింగర్ కమ్ డాన్సర్ జాఫర్ జాక్సన్ పోషిస్తున్నాడు. కానీ, మన ఇండియన్స్ మాత్రం మైఖేల్ జాక్సన్ పాత్రలో ప్రభుదేవా అయితేనే ఆ పాత్రకి న్యాయం చేయగలడని చెప్పుకుంటున్నారు. హాలీవుడ్‌లో అయితే మన ఇండియన్స్ అనుకున్నది జరిగే అవకాశం లేదు. కానీ, సౌత్ భాషలలో గనక మైఖేల్ జాక్సన్ బయోపిక్ నిర్మిస్తే మన ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా అయితేనే కరెక్ట్ అంటున్నారు.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.