Dil Raju: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పెట్టి ఇప్పటికి రెండు దశాబ్దాలు పూర్తవుతుంది. 20 ఏళ్లలో టాలీవుడ్ లో నిర్మాతగా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ దిల్ రాజు క్రియేట్ చేసుకున్నారు. ఎక్కువగా ఫ్యామిలీ ఓరియెంటెడ్ కథలతో బ్లాక్ బస్టర్ హిట్స్ సొంతం చేసుకున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోలు అందరూ కూడా పాన్ ఇండియా సినిమాల పైన ఎక్కువగా ఫోకస్ పెట్టారు. యూనివర్సల్ ఆప్పీల్ ఉన్న కథలను ఓకే చేస్తూ దేశవ్యాప్తంగా మార్కెట్ పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దిల్ రాజు కూడా నిర్మాతగా తన బ్రాండ్ ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
అందులో భాగంగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఇకపై అన్నీ కూడా భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలే చేయబోతున్నట్లుగా ప్రకటించారు. చిన్న సినిమాల కోసం దిల్ రాజు ప్రొడక్షన్స్ అనే మరో బ్యానర్ ని స్టార్ట్ చేశారు. ఇక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో ప్రస్తుతం పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న శాకుంతలం మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. మరోవైపు రాంచరణ్ శంకర్ కాంబినేషన్ లో గేమ్ చేంజర్ మూవీ కూడా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. వీటితో పాటు ఇప్పుడు దిల్ రాజు భారీ చిత్రాలను లైన్ అప్ లో పెట్టారు. అందులో ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో జటాయు అనే పాన్ ఇండియా సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది.
ఈ సినిమా కోసం స్టార్ హీరోని తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతోపాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఒక పౌరాణిక కథాంశంతో మూవీ ప్లానింగ్ చేస్తున్నారు. అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వంశీ పైడిపల్లి లేదా బాబి దర్శకత్వంలో ఒక సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. మెగాస్టార్ చిరంజీవితో ఒక ప్రాజెక్టు చర్చల దశలో ఉంది. దాంతోపాటు సుకుమార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాని కూడా దిల్ రాజు భారీ కాన్వాస్ పై నిర్మించబోతున్నారు. అలాగే పరశురాం విజయ్ దేవరకొండ కాంబినేషన్లో మూవీ తెరకెక్కనుంది. బాలకృష్ణతో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేసే ప్లానింగ్ కూడా జరుగుతుంది. ఇలా వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో వరుసగా 100 కోట్లకు పైగా బడ్జెట్ సినిమాలోనే దిల్ రాజు ప్లాన్ చేస్తూ ఉండడం ఇప్పుడు టాలీవుడ్ లో ఆసక్తికరంగా మారింది.