Wed. Jan 21st, 2026

    Deepika Padukone : లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరిగిన 95వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవంలో దీపికా పదుకొణె ఆదరగొట్టింది. తన రెడ్ కార్పెట్ లుక్ చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్‌లో “#ఆస్కార్స్95” అనే కాప్షన్ తో పంచుకుని ఫ్యాన్స్ కు పిచ్చెక్కించింది. అద్భుతమైన ఆఫ్-ది-షోల్డర్ జెట్-బ్లాక్ లూయిస్ విట్టన్ గౌనులో మాయ చేసింది.

    deepika-padukone-stunning-looks-in-black-gown-at-oscar
    deepika-padukone-stunning-looks-in-black-gown-at-oscar

    దీపికా పదుకొణె ఆస్కార్ వేడుకలో తాను ధరించిన చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. పోస్ట్‌లలో దీపిక ఆఫ్-ది-షోల్డర్ బ్లాక్ లూయిస్ విట్టన్ గౌను ధరించి, పాత-హాలీవుడ్ గ్లామ్‌తో స్టైలిష్ గా కనిపించింది సొగసైన కేశాలంకరణ, స్టేట్‌మెంట్ మేకింగ్ డైమండ్ ఆభరణాలు పెట్టుకుని ఎంతో హాట్ గా కనిపించింది.

    ఆమె మెడపై కొత్త టాటూ – 82°E మరింత అట్రాక్టివ్ గా కనిపిస్తోంది. ఆస్కార్ వేదికపై, ఉత్తమ ఒరిజినల్ సాంగ్ నామినీ నాటు నాటును పరిచయం చేయడానికి దీపిక హాజరైంది. భారతదేశం నుండి ఆస్కార్‌కు నామినేట్ అయిన మొట్టమొదటి పాట నాటు నాటు అని కూడా ఆమె సగౌరవంగా తెలిపింది.

    deepika-padukone-stunning-looks-in-black-gown-at-oscar
    deepika-padukone-stunning-looks-in-black-gown-at-oscar

    వేడుకల్లో భాగంగా దీపిక మరో ఔట్ ఫిట్ ను ధరించి ఫాన్స్ దృష్టి ని తన వైవు తిప్పుకుంది. లేటెస్ట్ ఫోటోషూట్ పిక్స్ ను తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసి ఫ్యాన్స్ కు వానిటీ ఫెయిర్ పార్టీ రూపంతో మెప్పించింది. ఈ పిక్స్ పోస్ట్ చేసిన కొద్దిగంటల్లోనే నెట్టింట్లో వైరల్ అయ్యాయి. అభిమానుల హృదయాలను గెలుచుకున్నాయి

    deepika-padukone-stunning-looks-in-black-gown-at-oscar
    deepika-padukone-stunning-looks-in-black-gown-at-oscar

    డీప్ నెక్‌లైన్‌తో కూడిన మెత్తటి గులాబీ రంగు ఈక దుస్తులను ధరించి మెరిసింది బ్యూటీ.నడుముకు నలుపు రంగు లెదర్ బెల్ట్‌ పెట్టుకుని తన కర్వ్స్ ను చూపింది. నలుపు రంగు మోచేతి వరకు ఉండే గ్లౌజ్ లు , పాదాలకు స్టైలిష్ ఫుట్ వేర్ వేసుకుని పాతకాలపు టచ్‌ని అందించి తన రూపాన్ని పూర్తి చేసింది.

    deepika-padukone-stunning-looks-in-black-gown-at-oscar
    deepika-padukone-stunning-looks-in-black-gown-at-oscar

    దీపిక చివరిగా షారుఖ్‌తో కలిసి పఠాన్‌లో కనిపించింది. దీనికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. దీపిక ప్రస్తుతం ప్రాజెక్ట్ K చేస్తోంది. ఈ మూవీ తెలుగు, హిందీ భాషలలో ఏకకాలంలో షూటింగ్ జరుకుంటోంది. ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా , అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

    deepika-padukone-stunning-looks-in-black-gown-at-oscar
    deepika-padukone-stunning-looks-in-black-gown-at-oscar