Mangoes: వేసవికాలం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరు కూడా మామిడి పండ్లను తినడానికి ఎంతో ఇష్టపడుతూ ఉంటారు మార్కెట్లోకి కూడా ఎన్నో రకాల మామిడి పండ్లు వస్తూ ఉంటాయి. అయితే మామిడి పండ్లు తినే ముందు చాలామంది వాటిని కడగకుండా అలాగే తింటూ ఉంటారు అయితే మామిడి పండ్లను కడగకుండా తింటున్నారు అంటే మీరు తప్పకుండా ప్రమాదంలో పడినట్టేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత కాలంలో మామిడి పండ్లను పచ్చివిగానే తీసి అవి పండటం కోసం భారీ స్థాయిలో రసాయనాలను చల్లి మాగ పెడుతున్నారు.
ఈ విధంగా రసాయనాలు చల్లిమాగ పెట్టడం వల్ల కచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వాటికి తినే ముందు కడిగి తినాల్సి ఉంటుంది. అలా కాకుండా నేరుగా తిన్నాము అంటే అందులో ఉన్నటువంటి రసాయనాలు మనకు హానికరం అయ్యే అవకాశాలు ఉంటాయి.కాబట్టి మామిడి కాయలను నీటిలో నానబెట్టుకుని తింటే బాడీ చల్లగా ఉంటుంది. దాంతో పాటు మామిడి తొక్కలో ఫైటిక్ యాసిడ్ అనే యాంటీ న్యూట్రియంట్ ఉంటుంది. ఇది బాడీకి చాలా ప్రమాదకరం.
మామిడి కాయలను నేరుగా తింటే పోషకాలను గ్రహించకుండా చేస్తుంది. ఫైటిక్ యాసిడ్ ఐరన్, జింక్, కాల్షియం లాంటివి బాడీ గ్రహించకుండా అడ్డుకుంటుంది. అందుకనే మామిడికాయలు తినడానికి అంటే ముందుగా ఒక ఐదు నిమిషాల పాటు నీటిలో నానబెట్టి శుభ్రంగా కడిగి తినటం వల్ల ఏ విధమైనటువంటి ప్రమాదం ఉండదని నిపుణులు చెబుతున్నారు.